పంచ పాండవుల్లో మొదటి వాడైన ధర్మరాజు ఎక్కువగా ధర్మాలు చేసేవాడని పేరు. తనకంటే ఎక్కువ దానం చేసిన వాళ్లు ఇంకెవ్వరూ లేరని ధర్మరాజు అభిప్రాయం. ఇది ఆయనకు అహంకారంగా మారకూడదని.. కృష్ణుడికి అనిపించింది. అందుకోసం కృష్ణుడు ధర్మరాజును మరో రాజ్యానికి తీసుకెళ్లాడు. ఆ రాజ్యం మహాబలిచక్రవర్తి గారి పాలనలో ఉండేది. అక్కడ ధర్మరాజు ఒకరి ఇంటి వద్దకు వెళ్లి మంచినీళ్లు అడిగారు. ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ధర్మరాజుకి బంగారు గ్లాస్ లో నీరు ఇచ్చింది. వారు నీరుని తాగిన తరువాత ఆమె ఆ గ్లాస్ బయటికి విసిరింది.
ఇక ధర్మరాజు ఆమెతో ఏమిటమ్మా..!బంగారాన్ని దాచుకోవాలి కానీ ఇలా వీధిలో పడేస్తే ఎలా అని అన్నాడు. దీంతో ఆమె మా రాజ్యంలో ఒకసారి వాడిన వస్తువును మళ్లీ వాడం అని బదులు చెప్పి లోపలికి వెళ్లిపోయింది. ఆ రాజ్యపు సంపదను గురించి ఆలోచిస్తూ ఆశ్చర్యపోయాడు ధర్మరాజు. రాజును కలవడానికి ఇద్దరూ వెళ్లారు. కృష్ణుడు మహాబలిరాజుతో ధర్మరాజును రాజా ఈయన ప్రపంచంలోనే ఎక్కువ ధర్మాలు చేసిన వ్యక్తి. పేరు ధర్మరాజు అని పరిచయం చేశాడు. అయినా ఆ రాజు ధర్మరాజు ముఖం కూడా సరిగ్గా చూడలేదు. కృష్ణుడితో ఆ రాజు ఇలా అన్నాడు. కృష్ణా మీరు చెప్పిన విషయం సరే. కానీ నా రాజ్యంలో ప్రజలకు సరిపడా పని ఉంది. అందరి వద్ద సంపద కూడా బాగానే ఉంది. నా రాజ్యంలో అందరికీ కష్టపడి పని చేయడం ఇష్టం.
Advertisement
Advertisement
ఇక్కడ బిక్షం తీసుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అందువల్ల దాన ధర్మాలకు ఇక్కడ తావు లేదు. ఇక్కడ ఎవ్వరికీ దానాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. పాపం ఈయన రాజ్యంలో పేదలు ఎక్కువగా ఉన్నట్టున్నారు. అందుకే అందరూ దానాలు అడుగుతూ వస్తున్నారేమో.. ఈయన రాజ్యంలో అంతమందిని పేద వారిగా ఉంచినందుకు ఈ రాజు ముఖం చూడాలంటే నేను సిగ్గు పడుతున్నాను. తన రాజ్య పరిస్థితిని తెలుసుకుని సిగ్గుపడి తలదించుకున్నాడు ధర్మరాజు. సహాయం అనే పేరుతో ప్రజలు అడుక్కుతినే విధంగా మార్చడం, ఉచితం అనే పేరుతో ప్రజలను సోమరులుగా మార్చడం అనేది ఎప్పటికైనా తలదించుకోవాల్సిందే అని మహాబలిచక్రవర్తి చెప్పాడు. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read :