Home » ఉద‌య్ కిర‌ణ్ లాంటి స్థితే ప్ర‌భాస్ కు కూడా…రెబ‌ల్ స్టార్ జాత‌కం పై వేణుస్వామి స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఉద‌య్ కిర‌ణ్ లాంటి స్థితే ప్ర‌భాస్ కు కూడా…రెబ‌ల్ స్టార్ జాత‌కం పై వేణుస్వామి స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by AJAY

ప్ర‌ముఖ జోతిష్య‌నిపుణులు వేణుస్వామి మరోసారి వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారారు. రీసెంట్ గా వేణుస్వామి చిరంజీవి చిన్న‌కూతురు శ్రీజ మూడో పెళ్లి చేసుకుంటుంద‌ని బాంబు పేల్చారు. అంతేకాకుండా ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా నాలుగో పెళ్లి చేసుకునే అవ‌కాశం ఉంద‌ని శ్రీజ ప‌వ‌న్ ల జాత‌కాలు ఒకే మాదిరిగా ఉన్నాయ‌ని కామెంట్స్ చేశాడు. ఇదిలా ఉండ‌గా వేణుస్వామి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఫుల్ బిజీగా ఉన్న ప్ర‌భాస్ జాత‌కం చెబుతూ గ‌తంలో ఓ వీడియో చేయ‌గా ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

ఈ వీడియోలో ప్ర‌భాస్ జాతకాన్ని వేణు స్వామి వివ‌రించాడు. ప్ర‌భాస్ లాంటి జాత‌కం కోట్ల‌ల్లో ఒక‌రికి ఉంటుంద‌ని చెప్పాడు. నాలుగు గ్ర‌హాలు ప్ర‌భాస్ కు అనుకూలంగా ఉన్నాయ‌ని అన్నాడు. దాంతో ఫ్యూచ‌ర్ లో ప్ర‌భాస్ మ‌రిన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ లు అందుకుంటాడ‌ని అన్నాడు. కానీ రెండు గ్ర‌హాలు మాత్రం ప్ర‌భాస్ కు అనుకూలంగా లేవ‌ని వ్యాఖ్యానించాడు. దాంతో ప్ర‌భాస్ కెరీర్ కొంత‌కాలం బాగున్న‌ప్ప‌టికీ ఆ త‌ర‌వాత అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని చెప్పాడు.

ప్ర‌భాస్ జాత‌కం ప్ర‌కారంగా అత‌డికి కిడ్నీ, లివ‌ర్, లంగ్స్ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతే కాకుండా అమ్మాయిలు ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే హీరోలు ఎక్క‌వ కాలం సినిమాల్లో రానించ‌లేర‌ని చెప్పాడు. అర‌వింద్ స్వామి, ఉద‌య్ కిర‌ణ్ ల జాత‌కాలు కూడా అలాంటివేన‌ని తెలిపాడు.

పెళ్లి విష‌యంలో కూడా ప్ర‌భాస్ కు అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని చెప్పారు. పెళ్లి ఆల‌స్య కావొచ్చ‌ని ఒక‌వేళ పెళ్లి చేసుకున్న‌ప్పటికీ ప్ర‌భాస్ కు స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని జోష్యం చెప్పారు. అయితే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌కూడ‌దు అంటే ప్ర‌భాస్ శ‌నిద‌శలోకి ప్ర‌వేశించేముందు కొన్ని యాగాలు చేయించుకోవాల‌ని వేణు స్వామి సూచించారు.

ALSO READ :జీవితంలో సౌంద‌ర్య చేసిన అతిపెద్ద త‌ప్పు ఏంటోతెలుసా.? త‌ల్లిదండ్రులు వ‌ద్ద‌న్నా విన‌కుండా..!

Visitors Are Also Reading