Home » ఆర్జీవీ కి ఘాటు ముద్దు పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….వీడియో వైరల్….!

ఆర్జీవీ కి ఘాటు ముద్దు పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….వీడియో వైరల్….!

by AJAY
Ad

అషు రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత గా అషు పాపులర్ అయింది. అలా సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత మెల్లిగా అషూ రెడ్డి బుల్లి తెరకు పరిచయమైంది. యాంకర్ గా పలు టీవీ షోల్లో చేసి అభిమానులను సంపాదించుకుంది. దాంతో ఈ బ్యూటీకి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. ఇక బిగ్ బాస్ తర్వాత అషు రెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరనే చెప్పాలి.

Advertisement

ప్రస్తుతం పలు టీవీ షోలు చేస్తూ ఈ హాట్ బ్యూటీ ఫుల్ బిజీగా ఉంది. ఇక టీవీ షోలతో పాటు సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో హాట్ అందాల ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. ఇక అషు రెడ్డి కొద్ది రోజుల క్రితం సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఇంటర్వ్యూ గురించి ఎంతో చర్చ జరిగింది. ఆర్జివి అషు రెడ్డిల ఇంటర్వ్యూ లను ఇద్దరూ ఊరించి ఊరించి మరీ విడుదల చేశారు.

Advertisement

 

ఇది ఇలా ఉంటే తాజాగా అషు రెడ్డి ఆర్జివి కి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆర్జీవీ అషు రెడ్డిని ముద్దు కావాలి అంటూ అడుగుతాడు. దానికి అష్షు నో నో నో అంటూ సమాధానం ఇస్తోంది. అయితే అలా సమాధానం ఇస్తూనే మీకు ఇప్పటికే చాలా వాటికి నో చెప్పాను అంటూ ఆర్జీవీ చెంప పై ముద్దు పెట్టేసింది. ఇక దీనికి సంభందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది దాంతో ఆర్జివి చాలా లక్కీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

https://www.instagram.com/arey_entira_edii/reel/CYnPvWjBOVn/?utm_medium=whats_app

 

Visitors Are Also Reading