ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ టోర్నీ మరికొన్ని రోజుల్లో వస్తుందనగా పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ఆల్ ఇస్ నాట్ వెల్ అనే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్ శ్రీలంక చేతిలో ఓడిపోయి ఏషియాకప్ లో సూపర్ ఫోర్ దశ నుంచి ఇంటి బాటపట్టింది. ఇప్పుడు జట్టుకు ఇద్దరు ప్రధాన ప్లేయర్లు సూపర్ స్టార్లు అయిన బాబర్ అజామ్, షహీన్ ఆఫ్రిది మధ్య గొడవ మొదలైందా… ? అంటే అవుననే తెలుస్తోంది.
ఏషియా కప్ ఎలిమినేషన్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లో హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినట్టు పాకిస్తాన్ మీడియా రిపోర్ట్ చెస్తుంది. జట్టు మొత్తాన్ని ఉద్దేశించి బాబర్ మాట్లాడాడట. ఆటగాళ్లు బాధ్యతాయుతంగా ఆడటం లేదని బాబర్ అన్నాడట. ఈ సమయంలో కలగజేసుకున్న షాహిన్ ఆఫ్రిది కనీసం బాగా బౌలింగ్, బ్యాటింగ్ చేసిన వాళ్లను అప్రిషియేట్ చేయొచ్చుగా అని అన్నాడట.
Advertisement
Advertisement
ఇలా ఎంటరప్ చేయడం బాబర్ కు నచ్చక ఎవరు బాగా ఆడుతున్నారో తనకు తెలుసు అన్నాడు. పరిస్థితి మరింత చేయి దాటకముందే అక్కడే ఉన్న వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ వాగ్వాదాన్ని ఆపాల్సి వచ్చినట్టు పాక్ లోని ఓ మీడియా సంస్థ రిపోర్ట్ చేసింది. ఇది ఎంతవరకు నిజమో ఎప్పటికీ బయటకు వచ్చే ఆస్కారమే లేదు. కానీ నిజంగా విభేదాలు ఉంటే మాత్రం వరల్డ్ కప్ ముందు జట్టులో ఐక్యత దెబ్బ తింటుంది. పాక్ బౌలర్లు, టీం మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా కలగజేసుకొని తీరాల్సిందే.
ఇవి కూడా చదవండి
- బైక్ మీద లిఫ్ట్ ఇచ్చిన ధోని….బండ బూతులు తిడుతున్న నెటిజన్లు…!
- నెక్స్ట్ లెవెల్ వెడ్డింగ్ కార్డు ! పవన్ క్రజ్ అంటే ఇదే కదా !
- Kodali Nani : నందమూరి వారి పెళ్ళిలో కొడాలి నాని.. పిక్ వైరల్!