Telugu News » స్టెప్పులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి కాస్త మీరు చెప్పండని హీరోయిన్ అంటే NTR చెప్పిన స‌మాధానం.

స్టెప్పులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి కాస్త మీరు చెప్పండని హీరోయిన్ అంటే NTR చెప్పిన స‌మాధానం.

by Azhar

అశ్వ‌నీద‌త్ మొద‌టి సారి నిర్మాత‌గా NTR హీరోగా, వాణిశ్రీ హీరోయిన్ గా బాప‌య్య డైరెక్ష‌న్ లో ఎదురులేని మ‌నిషి అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. కృష్ణా ముకుందా మురారీ అనే ఓ టీజింగ్ సాంగ్ షూటింగు జరుగుతోంది. శ్రీను అనే డాన్స్ మాస్ట‌ర్ ఆ పాట‌కు కొరియోగ్ర‌ఫి చేస్తున్నాడు.

Ads

 

ఆ పాట‌ను చిత్రిక‌రీస్తున్న స‌మ‌యంలో చిన్న బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ లో వాణిశ్రీ NTR దగ్గరకు వచ్చి… “ఆ డాన్స్ మాస్ట‌ర్ కంపోజ్ చేసిన మూమెంట్స్ చాలా దుర్మార్గంగా ఉన్నాయి. కాస్త మీరు ఆ డైరెక్ట‌ర్ ను పిలిచి ఈ విష‌యాన్ని చెప్తే బాగుంటుంద‌”ని చెప్పింది. దానికి NTR “నేను చెప్ప‌లేను వాణిశ్రీ గారూ” అంటూ ఖ‌రాఖండిగా చెప్పార‌ట‌!

“అదేంట‌”ని ప్ర‌శ్నిస్తే….. “ఇప్పటి ట్రెండ్ ఇది అని నమ్మి వాళ్లు తీస్తున్నారు. అది తప్పో ఒప్పో చెప్పడానికి మనమెవరం? మనం చేయం అంటే వేరెవరినైనా పెట్టుకుని తీసేసుకుంటారు. డబ్బులు పెట్టేది వారు కనుక ఎలా తీస్తే లాభం వస్తుందనే ఆలోచన చేసే తీస్తారు కదా … దాన్ని మనం ఎలా కాదనగలం?”

“ప్ర‌స్తుతానికి మన ముందున్నవి రెండు దారులు ఒకటి నచ్చకపోతే పూర్తిగా వదిలేసి వెళ్లిపోవడం, రెండు సర్దుకుపోయి నటించడం. నాకు తెల్సి ప్రస్తుతం మనం రెండో దారి ఎంచుకోవడమే కరక్టేమో” అన్నారట . మీరు ఒక్క మాట చెప్తే … అని మరోసారి అన్నారట వాణిశ్రీ … “నేను మహా అయితే ఇంకో ఐదారేళ్లు నటిస్తానేమో … కనుక వారు చెప్పినట్టు చేసుకెళ్లడమే బెటరనే నిర్ణయానికి వచ్చేశాను … ట్రెండును ఫాలో కావడం అంటారు కదా … అలా … వ్యక్తిగత ఇష్టాలతో ప్రమేయం ఏముంటుంది?” అని మరింత వివరణ కూడా ఇచ్చారట NTR!

క్రెడిట్స్ : భ‌ర‌ద్వాజ


You may also like