ఒకప్పుడు పరుగుల రాణిగా ప్రపంచ రికార్డులు సాధించిన క్రీడాకారిని అశ్విని నాచప్ప.. అప్పటికి ఇప్పటికీ ఈమె పేరు అంటే తెలియని వారు ఉండరు. అలాంటి అశ్విని నాచప్ప ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని నైజం కలిగిన క్రీడాకారిని మరియు నటి. తన స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యాక కరోబయ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత తన భర్త నిర్వహించే స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన పనులన్నీ చూసుకుంటుంది. అశ్వినికి ఇద్దరమ్మాయిలు. అనిషా పెద్దమ్మాయి. దీపాలి చిన్నమ్మాయి. అనీషా కూడా బ్యాడ్మింటన్ క్రీడలో రాష్ట్రస్థాయిలో మంచి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది.
Advertisement
also read:అత్తారింటికి వెళ్లే ముందు కూతురుకు తల్లి చెప్పిన విషయాలు..ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!
Advertisement
ఎప్పటికైనా తన కూతుర్ని మంచి బ్యాట్మెంటన్ ప్లేయర్ ను చేయాలన్నదే అశ్విని నాచప్ప కోరిక. తన చిన్న కూతురు దీపాలి కూడా గోల్స్ ప్లేయర్ గా కొనసాగుతోంది . ఎంతో ఖరీదైన ఆటగా చెప్పుకునే గోల్స్ ఆటలో ఎలాగైనా తన ప్రతిభ కనబరచాలని దీపాలి ప్రయత్నాలు చేస్తోంది. ఈ విధంగా అశ్విని నాచప్ప తన ఇద్దరు పిల్లలతో పాటుగా 32 మంది ఆడపిల్లలకు శిక్షణ ఇస్తోంది. అశ్విని నాచప్ప ఆడపిల్లలకు చెప్పే మాట ఒకటే ..
బాగా చదువుకోవాలి చదువుతోపాటు ఆటలు కూడా బాగా ఆడాలి అంటూ చెబుతుంది. అశ్విని గారికి ఇటు ఇండస్ట్రీలో అటు స్పోర్ట్స్ లో ఎంతో అనుభవం ఉండటంతో సమాజంలో ఆడపిల్లలకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏమిటో తనకు తెలుసు కాబట్టి ఆ సమస్యలను అధిగమించాలంటే ఆడపిల్లలు చదువుతోపాటు క్రీడలు కూడా పెంపొందించుకోవాలని చెబుతుంది. ఈ విధంగా ఆడపిల్లలకు ప్రేరణ కలిగిస్తూ అనేకమందికి శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతోంది ఈ క్రీడాకారిణి.
also read: