Home » చిరంజీవి మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా..?

చిరంజీవి మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా..?

by Azhar
Published: Last Updated on
Ad
రంగీలా సినిమా అంటే అందరికి మొదట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గుర్తుకు వస్తాడు. తెలుగులో శివ సినిమాతో వర్మకు ఎంత గుర్తింపు వచ్చిందో.. హిందీలో ఈ రంగీలా సినిమాతో ఆయా రేంజ్ గుర్తింపునే సంపాదించుకున్నాడు వర్మ.
అయితే ఈ సినిమా అనేది తెలుగులోనే తెరక్కేకాలి. ఇందులో చిరంజీవి, రజినీకాంత్, శ్రీదేవి కలిసి నటించాలి. కానీ వారికీ ఈ సినిమా అనేది దక్కలేదు. ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ ప్రకటించారు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అశ్వినీదత్ మాట్లాడుతూ… శివ సినిమా హిట్ అయిన తర్వాత నాతో సినిమా చేయాలనీ వర్మకు నేను అడ్వాన్స్ అనేది ఇచ్చారు. అప్పుడే వర్మ నాకు రంగీలా, గోవిందా గోవిందా సినిమా కథలు చెప్పారు. ఇందులో రంగీలా రజిని, చిరు, శ్రీదేవితో కలిసి తీస్తే సూపర్ హిట్ అవుతుంది అని వర్మ అనుకున్నాడు. కానీ నాకు గోవిందా గోవిందా సినిమా కథ నచ్చింది. వెంకటేశ్వరుని హుండీ చుట్టూ ఆ కథ తిరుగుతుంది. అందుకే నేను ఆ సినిమాను ఓకే చేసి నాగార్జునతో తీసాను
కానీ రంగీలా సినిమాలో కథ మొత్తం శ్రీదేవి చుట్టూ ఉంటుంది. చిరు, రజిని పాత్రలు అనేవి అంత ఇంపాక్ట్ చూపించవు అని అనుకున్నాను. అందుకే నేను ఈ సినిమా తీయలేదు అని అశ్వినీదత్ పేర్కొన్నారు.  కానీ ఆ తర్వాత అదే రంగీలా సినిమాను వర్మ బాలీవుడ్ లో జాకీ ష్రాఫ్, ఆమీర్ ఖాన్, ఊర్మిళతో తీసాడు. ఆ సినిమా అనేది సూపర్ హిట్ అయ్యింది. మొత్తం బాలీవుడ్ ను షేక్ చేసింది. కానీ ఇక్కడ గోవిందా గోవిందా ప్లాప్ అయ్యింది.

Advertisement

Visitors Are Also Reading