Home » “అశోక వనం లో అర్జున కళ్యాణం” సినిమా లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

“అశోక వనం లో అర్జున కళ్యాణం” సినిమా లో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే !

by AJAY
Ad

విశ్వ‌క్ సేన్ హీరోగా నటించిన అశోక‌వనంలో అర్జున క‌ల్యాణం సినిమా ఇటీవ‌ల విడుద‌లై మంచివిజ‌యం సాధించింది. ఈ సినిమా పెళ్లి అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ బ్యాగ్డ్రాప్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో సెకండ్ లీడ్ హీరోయిన్ గా రితిక నాయ‌క్ న‌టించి అల‌రించింది. కానీ సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ ల‌లో ఎక్క‌డా రితికా క‌నిపించ‌దు. అదే ఈ సినిమాలోని మ్యాజిక్ కూడా..ఇక రితికా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకోవ‌డంతో ప్రేక్ష‌కులు ఆమె గురించి సెర్చ్ చేయ‌డం మొద‌లు పెడుతున్నారు.

Advertisement

రితికా చూడ్డానికి అచ్చం తెలుగమ్మాయిలా ప‌క్కింటి అమ్మాయిలా కనిపిస్తోంది. దాంతో ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా న‌టించిన రుక్సార్ దిల్లోన్ ను డామినేట్ చేసింది. సినిమా చూసిన ప్రేక్ష‌కులు కూడా రుక్సార్ ను ప‌ట్టించుకోవ‌డం లేదు కానీ రితికా ను మాత్రం మ‌ర్చిపోలేక‌పోతున్నారు. ఇక రితికాకు ఆఫ‌ర్ లు కూడా వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే రితికా ఏకంగా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై మూడు సినిమాల‌కు సైన్ చేసింద‌ట‌.

Advertisement

గీతా ఆర్ట్స్ లాంటి బ‌డా బ్యాన‌ర్ లో మూడు సినిమాల‌కు సైన్ చేయ‌డం అంటే మామూలు విష‌యం కాదు. అంతే కాకుండా గీతా ఆర్ట్స్ రితికా కు భారీ రెమ్యున‌రేష‌న్ కూడా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంద‌ని టాక్ వినిపిస్తోంది. ఇక రితికా నాయ‌క్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే 2000 సంవ‌త్స‌రంలో జ‌న్మించింది.

అంటే ఇప్పుడు ముద్దుగుమ్మ వ‌య‌సు 22 సంవ‌త్స‌రాలు మాత్రమే. రితికా నాయ‌క్ న్యూ ఢిల్లీలో జ‌న్మించింది. ఆ త‌ర‌వాత చ‌దువు పూర్తిచేసుకుని మోడ‌లింగ్ చేసింది. సినిమాల‌పై ఉన్న రితికా నాయక్ కు మొద‌టి సినిమానే టాలీవుడ్ లో విశ్వ‌క్ సేన్ స‌ర‌స‌న చేసే అవ‌కాశం దక్కింది. ఇక ఈ సినిమా మంచి విజ‌యం సాధించడంతో పాటూ రితికా నాయ‌క్ న‌ట‌న సినిమాకు ఎంతో ప్ల‌స్ అయ్యింది.

ALSO READ :

అంద‌రికీ న‌చ్చిన ఖ‌లేజా ఎందుకు ఫ్లాప్ అయ్యింది…5 కార‌ణాలు ఇవేనా..!

“గంగోత్రి” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా….ఇప్పుడు ఏం చేస్తుందంటే..!

Visitors Are Also Reading