Home » ఆ హీరో వద్దకు మొదట “హీరో” కథ….కానీ ఎందుకు నో చెప్పాడో తెలుసా…!

ఆ హీరో వద్దకు మొదట “హీరో” కథ….కానీ ఎందుకు నో చెప్పాడో తెలుసా…!

by AJAY
Ad

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అశోక్ గల్లా. “హీరో” సినిమా తో అశోక్ గల్లా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.

Advertisement

సినిమాలో హీరో అవ్వాలని కోరుకునే ఒక యువకుడు అనుకోకుండా ఒక మర్డర్ కేసులో కేసులో ఇరుక్కోవడం….ఆ తర్వాత ఆ కేసు నుండి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ. అయితే ఈ కథను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ముందుగా హీరో నితిన్ కు వినిపించారట. కానీ నితిన్ కొన్ని కారణాలవల్ల ఈ ప్రాజెక్ట్ ను చేయలేకపోయాడు.

Advertisement

దాంతో శ్రీరామ్ ఆదిత్య అదే కథను అశోక్ గల్లా కు చెప్పి ఒప్పించారు. అలా హీరో సినిమాతో అశోక్ గల్లా ఎంట్రీ ఇచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా అప్ డేట్స్ ను వెల్లడిస్తూ ఉన్నారు. మరోవైపు రామ్ చరణ్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు.

ఇదిలా ఉంటే నితిన్ చివరగా భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన మ్యాస్త్రో సినిమా ఓటిటి లో విడుదల కాగా ఈ సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం థియేటర్ లో విడుదల చేస్తే మంచి కలెక్షన్లను రాబట్టేది. ఇక ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమా నితిన్ కు ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.

Also read : ఆ సినిమా, డ్యాన్స్ షో వ‌ల్ల నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది…అర్చ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

Visitors Are Also Reading