Home » దిల్ రాజు మామూలోడు కాదు…కొడుకు కోసం రంగంలోకి స్టార్ దర్శకుడు..టైటిల్ ఫిక్స్.!

దిల్ రాజు మామూలోడు కాదు…కొడుకు కోసం రంగంలోకి స్టార్ దర్శకుడు..టైటిల్ ఫిక్స్.!

by AJAY
Ad

టాలీవుడ్ నిర్మాత సోదరుడు శిరీష్ కుమారుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన రౌడీ బాయ్స్ సినిమా తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్ లో రన్ అవుతోంది.

Advertisement

అయితే ప్రమోషన్స్ భారీగా చేసినా ఈ చిత్రం నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. కానీ నిర్మాత దిల్ రాజ్ మాత్రం దీన్ని బ్లాక్ బస్టర్ అనను కానీ ఊహించిన విజయం సాధించామని చెప్పారు. ప్రాఫిట్స్ కూడా వచ్చాయని అన్నారు. కానీ ఈ సినిమా నిర్మాతలు లాస్ అయ్యారని చాలా వీక్ కలెక్షన్స్ వచ్చాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే దిల్ రాజు కొడుకు కోసం భారీగా ప్లాన్ చేసినట్టు. సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆశిష్ రెడ్డి రెండో సినిమా ను ఖరారు చేసినట్టు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాకు సెల్ఫిష్ అని టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాకు సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన కాశీ దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు దర్శకుడు సుకుమార్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు.

Visitors Are Also Reading