చలపతిరావు మృతి తో టాలీవుడ్ లో తీరని విషాదం నెలకొంది. అనారోగ్యం కారణంగా గత కొంతకాలం నుంచి నటనకు దూరమైన చలపతిరావు రెండు రోజుల కింద కన్నుమూశారు. కుమారుడైన రవిబాబు ఇంట్లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. 1200 కి పైగా చిత్రాల్లో నటించిన చలపతిరావు, విభిన్న పాత్రలో తనదైన ముద్రవేశారు. ఇండస్ట్రీలో ఎవరితో ఆయినా ఆప్యాయంగా మాట్లాడే చలపతిరావు అందరు బాబాయిగా పిలుస్తారు. అలాంటి చలపతిరావు నిజజీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయి.
Advertisement
ఇది ఇలా ఉండగా, ఈవీవీ సత్యనారాయణ, చలపతిరావు కుటుంబాలు ఎంతో సన్నిహితంగా ఉండేవి. ఈవీవీ కొడుకు నరేష్ ని హీరోగా అందుకే చలపతిరావు కొడుకు రవిబాబు అల్లరి సినిమాతో పరిచయం చేశారు. ఇక ఆర్యన్ రాజేష్ పెళ్లి కూడా చలపతిరావు దగ్గర ఉండి మరీ చేయించారు. అప్పటికే ఈవీవీ కన్నుమూయడంతో ఆర్యన్ రాజేష్ పెళ్లి బాధ్యతను చలపతిరావు భుజాన వేసుకున్నారు.
Advertisement
తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలంలో జేగురుపాడు కి చెందిన అమ్మాయితో నిశ్చితార్థం దగ్గరి నుంచి వివాహం వరకు అన్ని ఆయనే చూసుకున్నారు. అక్కడి ప్రాంతవాసులతో చలపతిరావుకు మంచి సంబంధాలు ఉండటంతో ఆ సంబంధం కుదిరింది. కడియం లో ఉండే నర్సరీ రైతు వెంకన్నతో చలపతిరావు అనుబంధం ఎన్నో ఏళ్ల పాటు సాగింది. ఎప్పుడు కడియం వెళ్ళినా వెంకన్న కలిసి వచ్చేవారు. ఈవివి కూడా కడియం దగ్గరలో షూటింగ్ చేసిన వెంకన్న అనే ఆ రైతును కలవకుండా వచ్చేవారు కాదు. చలపతిరావు సొంతంగా తీసిన కొన్ని సినిమాల్లో వెంకన్న నటించారు కూడా.