Home » అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…ఏం చేస్తుందంటే…!

అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా…ఏం చేస్తుందంటే…!

by AJAY
Ad

అనుష్క కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో అరుందతి కూడా ఒకటి. ఈ సినిమా అనుష్క కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమా ద్వారానే లేడీ ఓరియెంటెడ్ నటిగా అనుష్క గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో అనుష్క నటనకు మంచి మార్కులు పడ్డాయి. కేవలం అనుష్క మాత్రమే కాకుండా ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి.

Arundati child artist divya nagesh

Arundati child artist divya nagesh

అయితే ఈ చిత్రంలో అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన బాల నటి కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అనుష్క చిన్ననాటి క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దివ్య నగేష్. అయితే ఇప్పుడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా మారిపోయి సినిమాలు కూడా తీస్తోంది. నిజానికి దివ్య నగేష్ కేరళ నటి గా అప్పటికే 150కి పైగా అడ్వర్టైజ్మెంట్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Advertisement

ఆ తర్వాత ఆమె టాలెంట్ చూసి అరుంధతిలో చిన్ననాటిఅనుష్క పాత్ర కోసం తీసుకున్నారు. చిన్ననాటి అనుష్క పాత్రల్లోనూ నటించి దివ్య నరేష్ మెప్పించింది. ఇక ప్రస్తుతం దివ్య నగేష్ తమిళ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. బాల, శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్లతో దివ్య సినిమాలు చేస్తోంది.

Arundati child artist divya nagesh

మలయాళ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేసిన దివ్య నగేష్ ప్రస్తుతం మాత్రం ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది రీసెంట్ గా దివ్య నగేష్ ఫోటోషూట్ ఒకటి వైరల్ అవుతోంది. దాంతో తాను గ్లామర్ పాత్రలు చేయడానికి రెడీ అంటూ దివ్య నగేష్ సిగ్నల్ ఇస్తోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

Also read : ఖ‌డ్గం చిత్రంలో సంగీత బెడ్ రూమ్ సీన్ వెనుక అస‌లు క‌థ ఏమిటంటే..?

Visitors Are Also Reading