Home » అంతర్జాతీయ క్రికెట్ నుండి అర్షదీప్ ఔట్..!

అంతర్జాతీయ క్రికెట్ నుండి అర్షదీప్ ఔట్..!

by Bunty
Ad

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ అర్ష్ దీప్ సింగ్ మరోసారి ట్రోలింగ్‌ కు గురయ్యాడు. జనవరి 5న శ్రీలంకతో రెండో టీ20 లో అత్యంత చెత్త ప్రదర్శన ఇచ్చాడు. తొలి టి20 లో జ్వరంతో బాధపడి రెండో మ్యాచ్ కు జట్టులోకి వచ్చిన అతడు రెండో ఓవర్లో బౌలింగ్ కు వచ్చి వరుసగా మూడు నోబాల్స్ వేశాడు. ఇందులో 19 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా మరో రెండు నోబాల్స్ వేశాడు. 2 ఓవర్లను ఐదు నోబాల్స్ వేయడంతో హార్దిక్ పాండ్యా మళ్లీ అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్ లు కూడా చెరో నోబాల్స్ వేశారు. అయితే అర్ష్ దీప్ బౌలింగ్ పై విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి.

Advertisement

తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం బిజెపి ఎంపీగా ఉన్న గౌతమ్ గంభీర్ పై మండిపడ్డాడు. మ్యాచ్ అనంతరం గంభీర్ స్పందిస్తూ, ‘ఏడు నోబాల్. ఒకసారి ఊహించుకోండి. అంటే ఒక ఓవర్ కంటే ఎక్కువ. అంటే ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు 21 ఓవర్లు వేసినట్టు. క్రికెట్ లో ప్రతి బౌలర్, బ్యాటర్ కు చేదు అనుభవాలు ఉంటాయి. బౌలర్లు చెత్త బంతులు వేస్తారు. బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి వికెట్ సమర్పించుకుంటారు.

Advertisement

కానీ ఇది రిథమ్ కు సంబంధించిన విషయం. గాయం తర్వాత తిరిగి జట్టుతో చేరినప్పుడు నేరుగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడకూడదు. అతడు ముందు దేశవాళి క్రికెట్ ఆడాలి. అక్కడ కొన్ని మ్యాచ్ లు ఆడి బౌలింగ్ లో మీ పాత రిథమ్ అందుకున్నాక అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలి. ఎందుకంటే టి20 క్రికెట్ లో నోబాల్స్ అస్సలు ఆమోదయోగ్యం కాదు. అర్ష్ దీప్ లో అదే మిస్ అయింది. లేకుంటే ఇలాంటి షాక్ లు తినక తప్పదు. గా యం నుంచి కోనుకున్నాక దేశవాళీతో పాటు నెట్స్ లో ఎక్కువసేపు శ్రమించాలి. అక్కడ మెరుగ్గా ఉంటేనే మ్యాచ్లో రాణిం చగలుగుతాం’ అని కామెంట్స్ చేశాడు.

READ ALSO : బాలయ్యకు పెను ప్రమాదం.. హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

Visitors Are Also Reading