టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పై ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఒంగోలు జిల్లాలోని ముప్పాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్లగణేష్ రూ.1.25 కోట్ల చెక్కును అందించినట్లు తెలుస్తోంది. అయితే ఆ చెక్కు బౌన్స్ కావడంతో వెంకటేశ్వర్లు బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు. దాంతో విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అయినప్పటికీ బండ్ల గణేష్ పట్టించుకోలేదు. దాంతో బండ్ల గణేష్ ను అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి అరెస్టు వారెంట్ జారీ చేసినట్టు సమాచారం. దాంతో సోమవారం బండ్ల గణేష్ కోర్టుకు హాజరైనట్టు తెలుస్తోంది.
Advertisement
ఇదిలా ఉండగా గతంలో కూడా బండ్ల గణేష్ పై మరో కేసు నమోదైంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి బండ్ల గణేష్ కు తాను రూ.13 కోట్లు ఇచ్చానని కానీ ఆయన తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో కడప లో బండ్ల గణేష్ పై మహేష్ ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు బండ్ల గణేష్ పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో కూడా బండ్ల గణేష్ కోర్టుకు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అరెస్ట్ చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు బండ్ల గణేష్ ను హాజరు పరిచారు.
Advertisement