Home » అమెరికా అమ్మాయి తో ఆర్మూరు అబ్బాయి… వీళ్ళ లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్ట్ లు…!

అమెరికా అమ్మాయి తో ఆర్మూరు అబ్బాయి… వీళ్ళ లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్ట్ లు…!

by AJAY
Ad

పెళ్ళిళ్ళు స్వర్గం లో నిశ్చయించబడతాయని అంటారు. ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో అస్సలు ఊహించలేం. పెళ్లి విషయం లో ఎన్నో ట్విస్ట్ లు ఉంటాయి. కొన్ని సార్లు ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇక కొంతమంది పెద్దలు చూసిన వారికి పెళ్లి చేసుకుంటే..మరి కొంతమంది వారికి నచ్చిన వారినే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.

Advertisement

అయితే ప్రేమ కు జాతి, కులం, మతం, ప్రాంతం తో సంబంధం ఉండదు. తాజాగా మరోసారి అది రుజువు అయ్యింది. మనదేశంలోని తెలంగాణ రాష్ట్రం ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓ యువకుడు అమెరికా అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. చాలా కాలం పాటు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అంతే కాకుండా పెళ్లి కూడా చేసుకున్నారు.

Advertisement

పెళ్లి కుమారుడి పేరు మూగ ఆకాష్ కాగా అతడు ఆర్మూర్ లోని గోవిందు పేట గ్రామానికి చెందినవాడు. ఆకాష్ చర్చి ఫాదర్ లకు క్లాస్ లు నిర్వహిస్తూ ఉంటాడు. కాగా ఆకాష్ కు అమెరికా కు చెందిన అలెక్స్ ఓక్స్ తో పరిచయం ఏర్పడింది. అలెక్స్ ప్రస్తుతం ఇండియా లోనే నర్స్ గా ఉద్యోగం చేస్తోంది.

ఇక ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమ గా మారడం తో పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మొదట వీరి పెళ్లికి ఆకాష్ కుటుంబ సభ్యులు నో చెప్పారు. కానీ ఆ తరవాత కుమారుడి ప్రేమను అర్థం చేసుకుని నచ్చిన అమ్మాయితోనే వివాహం జరిపించారు. వీరి వివాహానికి అమెరికా నుండి వధువు బంధువులు హాజరయ్యారు.

Also read :అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

Visitors Are Also Reading