Ad
క్రికెట్ దేవుడిగా గుర్తింపు తెచుకున్న సచిన్ టెండూల్కర్ కొకుడు అర్జున్ టెండూల్కర్ ఆట చూడాలి అని చాలా మంది అభిమానులు అనుకుంటున్నారు. అక్కని వారికీ ఆ అదృష్టం దక్కడం లేదు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుతో దాదాపు 4 ఏళ్ళు ఉన్న తర్వాత గత ఏడాది ఐపీఎల్ వేలంలో అర్జున్ ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. కానీ ఒక్క మ్యాచ్ ఆడించలేదు. మళ్ళీ ఆ తర్వాత ఈ ఐపీఎల్ 2022 ముందు జరిగిన మెగవేలంలో కూడా అర్జున్ ను తీసుకున్న ముంబై మళ్ళీ అతడిని కేవలం బెంచ్ కు మాత్రమే పరిమితం చేసింది.
ఇక ఆ ముంబై ఇండియన్స్ తో పాటుగా ఇప్పుడు ముంబై క్రికెట్ ఆసోసియేషన్ కూడా అర్జున్ టెండూల్కర్ ను పక్కన పెట్టేసింది. అయితే ఇప్పటివరకు రంజీలో ఆడని అర్జున్ ను ఈ జూన్ నుంచి మొదలుకాబోయే రంజీ నాకౌట్ దశలోని ముంబై జట్టులో ఉంటాడు అని చాలా ప్రచారం జరిగింది. అయితే ఈరోజు తాజాగా ఆ టోర్నీ కోసం ప్రకటించిన ముంబై జట్టులో మాత్రం అతని పేరు వినిపించలేదు. దాంతో మళ్ళీ సచిన్ అభిమానులు నిరాశ చెందారు. ఇక మరికొందరు అయితే అర్జున్ ను ఆ ముంబై పట్టించుకోలేదు.. ఈ ముంబై పట్టించుకోలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే.. ఈ ఐపీఎల్ లో ఎప్పుడో ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పునా ముంబై ఇండియన్స్ జట్టు తర్వాత చాలా మంది యువ ఆటగాళ్లను తుది జట్టులోకి తీసుకుంది. కానీ అర్జున్ ను మాత్రం ఆడించలేదు. అదే అభిమానులకు ఇంకా ఎక్కువ కోపాన్ని తెపించింది. ఈ విషయంలో ముంబాయి యాజమాన్యం అలాగే కెప్టెన్ రోహిత్ శర్మపై చాలా విమర్శలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటె ఈ రంజీ టోర్నీలో మొదటి మ్యాచ్ ను ఉత్తరాఖండ్ జట్టుతో ఆడనుంది ముంబై. ఈ టీంకు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాను కెప్టెన్ గా నియమించింది.
ఇవి కూడా చదవండి :
జడేజాను వదిలేస్తే చెన్నైకి 16 కోట్ల లాభం..!
కోహ్లీ కెప్టెన్ అయితే ఆర్సీబీ పని గోవిందా.. గోవిందా..?
Advertisement