Home » మీరు డిప్రెష‌న్ తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే పొర‌పాటున కూడా వీటిని అస్స‌లు తీసుకోకండి..!

మీరు డిప్రెష‌న్ తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే పొర‌పాటున కూడా వీటిని అస్స‌లు తీసుకోకండి..!

by Anji
Ad

మ‌నం తీసుకునే ఆహారం, పానియాలు మ‌న ఆరోగ్యం, మెద‌డుపై ప్ర‌భావం చూపుతాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని ఆహారాల‌ను దూరంగా ఉండాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాధార‌ణంగా మాన‌సిక స్థితిని మార్చ‌డానికి త‌ర‌చుగా అనేక ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటారు. ఇలాంటి ప‌రిస్తితిలో డిప్రెష‌న్ లేదా ఒత్తిడి స‌మ‌స్య‌లను ఎదుర్కున్న‌ట్ట‌యితే కొన్ని ఆహారాల‌ను తిన‌కుండా ఉండ‌డం బెట‌ర్ అని సూచిస్తున్నారు వైద్యులు. కొన్ని ఆహార ప‌దార్థాల‌ను తీసుకోక‌పోవ‌డం బెట‌ర్‌. లేకుంటే అవి మిమ్మ‌ల్ని దీర్ఘ‌కాలంలో మ‌రింత డిప్రెష‌న్‌లో ప‌డేసే ప్ర‌మాద‌ముంద‌ని పేర్కొంటున్నారు. వీటి కార‌ణంగా నిరాశ లేదా ఒత్తిడి, ఆందోళ‌న పెరిగే అవ‌కావం ఉందంటున్నారు. ఎటువంటి ఆహారాల‌కు దూరంగా ఉండాల‌నే విష‌యాల‌ను తెలుసుకోవ‌డం ముఖ్యం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.


ప్యాక్ చేసిన పేస్ట్రీలు, బిస్కేట్లు, బ్రెడ్‌ల‌లో సోడియం అధికంగా ఉంటుంది. ఇవి డిప్రెష‌న్ ను పెంచుతుంది. ఇలాంటి ఆహారాలు తీసుకోవ‌డం ద్వారా మీ క‌డుపులో అజీర్ణ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందువ‌ల్ల సోడియం అధికంగా ఉండే ప‌దార్థాల‌ను అస‌లు తీసుకోకూడ‌దు.

Advertisement

Advertisement

చాలా మంది నిద్ర నియంత్రించ‌డానికి టీ లేదా కాఫీని తీసుకుంటారు. ఈ రెండింటిలో కెఫిన్ అధికంగా ఉంటుంది. టీ, కాఫీ నిద్ర‌ను త‌గ్గించ‌డానికి ప‌ని చేస్తాయ‌ని.. దీని కార‌ణంగా ఆందోళ‌న మ‌రింత పెరుగుతుంది. ఎందుకంటే కెఫిన్ ఉన్న వాటిని తీసుకోవ‌డం ద్వారా చికాకు క‌లుగుతుంది. క్ర‌మంగా డిప్రెష‌న్ పెరుగుతుంది. అందువ‌ల్ల డిప్రెష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతుంటే కెఫిన్ ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి.

మ‌ద్యం-దూమ‌పానం వంటివి శ‌రీరానికి హాని క‌లిగిస్తాయ‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. డిప్రెష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ట్ట‌యితే మ‌ద్యం, సిగ‌రేట్ కు దూరంగా ఉండాలి. వీటిని తీసుకున్న‌ట్ట‌యితే నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు. దీని ఫ‌లితంగా ఆందోళ‌న‌, డిప్రెష‌న్  పెరుగుతుంది. దీంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అందుకే వీటిని తీసుకోకుండా ఉంటే చాలా బెట‌ర్‌.

Also Read : 

Hair Tips : జుట్టు ఎక్కువగా జుట్టు రాల‌డానికి ఈ ఐదు కార‌ణాలే కార‌ణం.. శ్ర‌ద్ధ వ‌హించ‌డంలో ఇక ఆల‌స్యం చేయ‌కండి..!

సాయిప‌ల్ల‌వి షాకింగ్ నిర్ణ‌యం.. కార‌ణం అదేనా..?

Visitors Are Also Reading