ఆరోగ్యంగా ఉండేందుకు తగినంత నిద్ర అవసరం. కానీ, అతినిద్ర అనారోగ్యానికి అనర్థం అని హెచ్చరిస్తున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే.. తొమ్మిది గంటల కంటే ఎక్కువ నిద్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. అతి నిద్ర హైపర్ సోమ్నియాతో బాధపడుతున్నారనేందుకు సంకేతమని వివరిస్తున్నారు. ఇది శరీరం, మనసుపై దీర్ఘకాలిక చెడు ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు. ఎక్కువ నిద్ర మనకు అనేక సమస్యలను కలిగిస్తుంది. ఇది ఒళ్లు నొప్పులు, మోకాళ్ల-కీళ్ల నొప్పులు, బద్ధకం మొదలైన వాటికి కారణమవుతుంది.
అధిక నిద్ర సాధారణ దుష్ప్రభావం.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణం. ఎక్కువ నిద్రపోయే వ్యక్తుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అతిగా నిద్రపోతే అంతర్గత అవయవాలైన కాలేయం, పేగుల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
Also Read : విద్యాబాలన్ ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి.. చివరికీ ఆమె ఏం చేసిందంటే..?