Home » రాత్రి సమయంలో ఇలా పడుకుంటున్నారా.. అయితే మీరు తప్పక ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

రాత్రి సమయంలో ఇలా పడుకుంటున్నారా.. అయితే మీరు తప్పక ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!

by Anji
Ad

సాధారణంగా మనం రాత్రి సమయంలో నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనం చేసే ప్రతీ పని మనపై ప్రభావాన్ని చూపిస్తుంది.  కాబట్టి ఏదైనా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని  చేయడం మంచిది  అంటున్నారు నిపుణులు.  ముఖ్యంగా చాలామంది రాత్రి సమయంలో నిద్రపోయే సమయంలో  అనేక తప్పులు చేస్తుంటారని అంటున్నారు. మనం నిద్రపోయే భంగిమ కూడా మన ఆరోగ్యంపై కీలకమైన ప్రభావాన్ని చూపుతుందట. మరి ఎలాంటి భంగిమలో పడుకుంటే మనకు మంచిది అనే  విషయాలను  ఇప్పుడు  మనం తెలుసుకుందాం. 

Advertisement

అయితే కొంతమంది కుడివైపు తిరిగి పడుకుంటే, మరి కొంతమంది ఎడమవైపు తిరిగి  పడుకుంటారు. మరి కొంతమంది బోర్లా పడుకుంటారు. ఇలా పడుకోవడంలో ఎడమవైపు తిరిగి పడుకుంటే మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఇలా పడుకోవడం వల్ల మెదడు సంబంధిత సమస్యలు రాకుండా ఉండడమే కాకుండా జీర్ణవ్యవస్థ బాగుంటుందని అంటున్నారు. మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై వ్యర్థాలు వంటివి పెద్ద పేగు బయటకు వెళ్ళిపోతాయి.

Advertisement

అలాగే ఇలా పడుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదట. గుండెకు రక్తం సులభంగా సరాపరా అయి ఒత్తిడి కూడా తగ్గుతుందని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు కూడా ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల  మంచిదట. దీనివల్ల పిండానికి గర్భాశయానికి రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుందని, బిడ్డకు పోషకాలు సులభంగా అందుతాయని అంటున్నారు.  అంతేకాకుండా గురక, ఆయాసం వంటివి ఉన్నవారు కూడా ఎడమవైపు తిరిగి పడుకోవాలని  దీనివల్ల శ్వాస సులభంగా వచ్చి హ్యాపీగా నిద్రపోతారని తెలియజేస్తున్నారు ఆయుర్వేద నిపుణులు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Sai Pallavi : సాయి పల్లవి కి పెళ్లి అయిపోయిందా.. ఫొటోస్ వైరల్..!

బ్యూటీ పార్లర్ కి వెళ్ళక్కర్లేదు.. చిటికెలో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు..!

Visitors Are Also Reading