Home » మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఆర్థిక ఇబ్బందులే..!!

మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. లేదంటే ఆర్థిక ఇబ్బందులే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని చాలామంది ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. మనం శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ ఉండే వాతావరణం పాజిటివ్ గా ఉంటుందని అంటున్నారు వాస్తు నిపుణులు. ఇంట్లో పెట్టుకోవడం వల్ల శక్తిని మరియు అదృష్టాన్ని కలిగిస్తుంది. అయితే ఈ మనీ ప్లాంట్ ను మన ఇంట్లో ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో మాత్రమే ఈ మనీ ప్లాంట్ ను పెట్టాలట.

Advertisement

ఇంట్లోని ఈశాన్య భాగంలో ఈ ప్లాంట్ ను అస్సలు ఉండకూడదట. అలా ఉంచడం వల్ల మనకు జరిగే లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు కాకుండా ఇంట్లో వాళ్ళు అనారోగ్యం బారిన పడతారట. అలాగే ఈశాన్యంలో బరువులు కూడా ఉండకూడదు. కొంతమంది పూలకుండీలు ఈ దిక్కులో ఉంచుతారు. కుండీల్లో లేదా సీసాల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోని ఆర్థిక స్థితి మెరుగవుతుందట. అలాగే మనీ ప్లాంట్ కు రోజు కొంత నీళ్లు పోయాలి. ఇలా చేయడం వల్ల ఇంటిలోని పరిసరాల్లో అనుకూలమైన శక్తి ఆవహిస్తుంది.

Advertisement

ఎండిపోయిన పసుపు రంగులోకి మారిన పత్రాలను ఎప్పటికప్పుడు తొలగించకపోతే వాస్తు దోషం పడుతుంది. అందుకే ఈ ప్లాంట్ ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచితే ఆర్థికంగా బాగుంటుందని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది విఘ్నేశ్వరుడి కి ఇష్టమైన దిక్కు. మనీ ప్లాంట్ అనేది వేగంగా పెరుగుతుంది.దీన్ని నేలకు తాకకుండా తాడు సహాయంతో పైకి పెరిగేటట్లు చూసుకోవాలి. సాధారణంగా మనీప్లాంట్ అంటే లక్ష్మీ దేవి స్వరూపం. వాస్తు ప్రకారం చూస్తే ఎండిన మనీప్లాంట్ దురదృష్టానికి చిహ్నం. ఇది మన ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. దీన్ని నివారించడానికి ప్రతిరోజు మనీ ప్లాంట్ కు నీరు పోయాలి.

ALSO READ;

ఆ ఒక్క కార‌ణంతోనే పెళ్లికి దూర‌మైన నాగార్జున హీరోయిన్ ..అదేంటంటే…?

ప‌విత్ర నా భార్య‌.. న‌రేష్ ఎవ‌రో నాకు అస‌లు తెలియ‌దంటున్న సుచీంద్ర‌..!

 

Visitors Are Also Reading