Home » మీ స్మార్ట్ ఫోన్ లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..అయితే ఖచ్చితంగా హ్యాక్ అయినట్టే..?

మీ స్మార్ట్ ఫోన్ లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా..అయితే ఖచ్చితంగా హ్యాక్ అయినట్టే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం చాలా టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీని మంచి కోసం వాడుకుంటే మంచిదే.కానీ చెడు పనుల కోసం వాడుకుంటే అనేక సమస్యలు వస్తాయి. ఈ టెక్నాలజీ కాలంలో అర చేతిలో ఫోన్ పట్టుకొని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో తెలుసుకుంటున్నాం.. అలాంటి యుగంలో టెక్నాలజీ ఎంతో ఉపయోగపడమే కాకుండా దీని ద్వారా అనేక అనర్ధాలు కూడా వస్తున్నాయి.. ప్రస్తుతం అన్నం లేకున్నా ఉంటారు కానీ చేతిలో మొబైల్ లేకుంటే ఉండే పరిస్థితి అయితే లేదు.

Advertisement

Also Read;సమంత తెల్లని దుస్తులు జపమాల ధరించడం వెనుక ఇంత కథ ఉందా..?

ఈ పరిస్థితిని ఆసరా చేసుకున్న కొంతమంది హ్యాకర్లు మీ యొక్క మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి యాడ్స్ కు అడ్వటైజ్ చేయడం, మీ యొక్క పర్సనల్ డేటాను చేజిక్కించుకొని ఇతరత్రా పనులకు ఉపయోగిస్తున్నారు. అయితే మన మొబైల్ హ్యాక్ అయిందని మనం ఏ విధంగా గుర్తించాలి.. అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.. ఒకవేళ మీ మొబైల్ హ్యాక్ అయినట్లయితే మీ బ్యాటరీ చాలా త్వరగా అయిపోతుంది.

Advertisement

అంతేకాకుండా మీ మొబైల్ లో డేటా మీరు ఉపయోగించే దానికంటే ఎక్కువగా ఖర్చవుతుంది. ఎంతో స్పీడుగా పనిచేసే మీ ఫోన్ సడన్ గా వేగం తగ్గిపోతుంది. ఫోన్ దానంతట అదే రీస్టార్ట్ కావడం వంటివి కనిపిస్తాయి. ఇలాంటివి ఏవైనా కనిపించినట్లయితే మీ మొబైల్ హ్యాక్ అయినట్లుగా మనం గుర్తించాలి. అయితే మన దగ్గర ఉన్న పాత మొబైల్ లలో ఈ సమస్యలు ఉంటాయి కానీ, ప్రస్తుతం కొనుగోలు చేసే లేటెస్ట్ 5జి మొబైల్స్ లో ఈ సమస్యలు ఉంటే జాగ్రత్తపడాలని నిపుణులు అంటున్నారు.

Also read;వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు.. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది..!

Visitors Are Also Reading