Home » నేరేడు పండ్లు తింటున్నారా.. అయితే నీళ్లు అస్సలు తాగకండి.. ఏమవుతుందంటే..?

నేరేడు పండ్లు తింటున్నారా.. అయితే నీళ్లు అస్సలు తాగకండి.. ఏమవుతుందంటే..?

by Sravanthi
Ad

సాధారణంగా మార్కెట్లో దొరికే సీజన్ పండ్లలో నేరేడు పండ్లు కూడా చాలా ప్రయోజనకరం. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. ఈ పండ్ల లో ఉండే పిండి పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు,మాంసకృత్తులు, ఐరన్, ఫాస్పరస్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే నేరేడు పండ్లను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తింటే శరీరంలో సమస్యలు ఏర్పడతాయట.

also read:నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Advertisement

నేరేడు పండు శరీరంలో ఉండే మలినాలను తొలగిస్తుంది. వీటిలో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు మెదడుకు,గుండెకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. అంతేకాకుండా కాలేయ పనితీరును మెరుగుపరిచి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చాలామంది నేరేడు పండ్లు తిన్న తర్వాత ఎక్కువగా నీరు తాగుతూ ఉంటారు. కానీ అలా చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Advertisement

also read:పూరిని వీడని “లైగర్” చిక్కులు.. ఫిల్మ్‌చాంబర్‌ ఎదుట ఎగ్జిబిటర్ల ఆందోళన

నీరు తాగితే గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. తప్పనిసరిగా నేరేడు పండ్లు తిన్న తర్వాత అరగంటకు నీరు తాగితే మంచిదని అంటున్నారు. అలాగే ఖాళీ కడుపుతో కూడా నేరేడు పండ్లు తినకూడదు. ఇవి రుచికి పుల్లగా ఉండటం వల్ల కలిగే గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అలాగే జీర్ణ సమస్యలు కూడా ఎక్కువ అవుతాయని అంటున్నారు.

also read:తమన్నాతో డేటింగ్ పై విజయ్ వర్మ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading