సాధారణంగా కంది పప్పు అంటే చాలా మంది కాస్త ఎక్కువగానే తింటారు. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆహారంలో కంది పప్పు కూడా ఒక భాగమే. కందిపప్పులో ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి కంది పప్పు చాలా మంచిది. ప్రతి రోజూ పప్పు తినడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు అందుతాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు ఎ, బి, సి వంటి పోషకాలు అందుతాయి. ఇంకా కందిపప్పుతో ఎలాంటి లాభాలు, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
కంది పప్పు వల్ల కలిగే లాభాలు :
- ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. జీర్ణ సమస్యలు, మల బద్ధకం సమస్య రాకుండా ఏర్పడదు. అంతే కాకుండా పొట్ట కూడా ఫ్రీగా ఉంటుంది.
- కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి ప్రోటీన్ లోపంతో ఉండే వారు ఇది తినడం చాలా బెస్ట్.
- బరువు తగ్గాలి అనుకునేవారు కూడా పప్పు తింటే సులభంగా వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇది తక్కువగా ఉన్న తిన్నా.. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.
- డయాబెటీస్ ఉన్నవారు కూడా పప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా కంది పప్పును హ్యాపీగా తినొచ్చు.
కంది పప్పుతో కలిగే దుష్ఫ్రభావాలు :
Advertisement
- కందిపప్పుతో లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి. కందిపప్పును ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాలు కూడా ఉండవు. ఎందుకంటే ఇందులో కంది పప్పులో కొన్ని రకాల చక్కెరలు ఉంటాయి.
- కంది పప్పును ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ వంటి సమస్యలు ఉండేలా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు కూడా రావచ్చు.
- కంది పప్పును తినుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అలెర్జీ ఉన్నవారు దురద, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
- అదేవిధంగా గుండెల్లో మంట, అసిడిటీ వంటి సమస్యలు కూడా రావచ్చు. ఎక్కువగా తింటే రక్త హీనత సమస్య, ఐరన్ లోపం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read : దంతాలు పసుపుగా మారిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి..?