ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రావడానికి ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైజాగ్ లో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పర్యటన వివాదాస్పదమైన తర్వాత జనసేన, అధికార పార్టీ మధ్య వాదనలు, అభిప్రాయ భేదాలు, విమర్శనాస్త్రాలు జోరందుకున్నాయి. అయితే ఇలాంటి ఘర్షణ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను చంపేందుకు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలతో కేసు నమోదు చేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
Advertisement
Also Read : అర్థరాత్రి తినేవారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదముంది జాగ్రత్త..!
పవన్ కళ్యాణ్ గత నెల వైజాగ్ కు చేరుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. పవన్ కళ్యాణ్ ర్యాలీ కొనసాగుతున్న సమయంలో వీధి దీపాలు ఆర్పివేశారు. చీకట్లోనే పవన్ ర్యాలీని కొనసాగించడం, పోలీసులు అధికారులు బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. వైజాగ్ లోని ఓ ప్రముఖ హోటల్ లో పవన్ కళ్యాణ్ ను దిగ్బంధం చేయడం మరింత వివాదాస్పదమైంది. రెండు రోజులపాటు కొనసాగిన ఉద్రిక్తతలు రాజకీయంగా వేడిని పుట్టించింది. తమ కార్యకర్తలను బెయిల్ పై విడిపించుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ విజయవాడకు తిరిగి వచ్చారు.
Advertisement
Also Read : కృష్ణ తల్లిదండ్రులు మొదటిభార్య ఇందిరాదేవిని కాదని విజయనిర్మల ఇంట్లో ఎందుకు ఉండేవారు..?
వైజాగ్ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్, మరో సీనియర్ నేత ఇండ్ల వద్ద రెక్కీ నిర్వహించారు. కొందరు గుర్తుతెలియని అగంతకులు వెంబడిస్తున్నారు అని జనసేన నేతలు ఆరోపించారు. అయితే పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొందరు సెక్యూరిటీతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చిందని వాదన తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకొని నిర్వహించిన రెక్కీకి సంబంధించిన వీడియోలను, ఫోటోలను జనసేన నేతలు పోలీసులకు అందజేశారు. వైజాగ్ ఘటన తర్వాత ఇలాంటి సంఘటనలు అనుమానాస్పద రీతిలో పార్టీ కార్యాలయం, పవన్ కళ్యాణ్ ఇంటివద్ద కొందరు అగంతకులు కనిపించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Also Read : సమంత ఆరోగ్యంపై నాగచైతన్య ఏమంటున్నారో తెలుసా ?