Home » ఆల్కహాల్ కు బానిస అయ్యారా.. అయితే ఈ పద్ధతితో పూర్తిగా మానేయండి..!!

ఆల్కహాల్ కు బానిస అయ్యారా.. అయితే ఈ పద్ధతితో పూర్తిగా మానేయండి..!!

by Sravanthi
Ad

ఆల్కహాల్ అనేది బాడీ లోకి వెళ్ళాక మనిషి కంట్రోల్లో ఉండడం చాలా కష్టం. అది లిమిట్ లో ఉంటే ఓకే. కానీ లిమిట్ తప్పింది అంటే మన మైండ్ మన చేతిలో ఉండదు. ఆల్కహాల్ కు బానిస అయిన వారు మందు మానేయాలంటే చాలా కష్టం అవుతుందా.. అయితే ఈ పద్ధతి ద్వారా మానేయండి.. మనం ఏంటో చూద్దామా..!!టీనేజ్ లో ఉన్నటువంటి పిల్లలకు మద్యం అనేది ఒక సరదా కావచ్చు.. అది ఒక సాహసంలా అనిపించవచ్చు.. కానీ జీవితంపై అవగాహన లేని మరియు ఆరోగ్యంపై అవగాహన లేని వయసులో మద్యపానానికి అలవాటు పడితే చాలా ప్రమాదం. మెదడు ఎదుగుతున్న సమయంలో ఆల్కహాల్ కు బానిస ఐతే జీవితంలో అనేక సమస్యలు వస్తాయని డాక్టర్లు అంటున్నారు. మన భావోద్వేగానికి మరియు జ్ఞాపకశక్తికి కేంద్రబిందువైన అమిగ్దాల పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితంగా ఆందోళన ఎక్కువగా పెరుగుతుంది.. మద్యపానానికి మరింత బానిస మారుతారు. కానీ ఇప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేదు. కానీ తాజాగా చికాగో శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని చూపించారు. ఈ అమిగ్డలా పనితీరులో కీలకమైన పాత్ర పోషించే అర్క్ అనేటువంటి జన్యువును సరిదిద్ద గలిగితే సానుకూలమైన ఫలితాలు వస్తాయని గ్రహించారు. దీనికోసం ఆ జన్యువును సాధారణ దశకు వచ్చే లా రిసెట్ చేస్తారు.

Advertisement

ALSO READ;

Advertisement

నేను మా సీఈవో పేరు అందుకే తీసాను : శ్రేయాస్

చాణక్య నీతి: శత్రువులను ఓడించే, విజయం సాధించే సూత్రాలు.. ఏంటంటే..!!

 

Visitors Are Also Reading