Home » కమెడియన్ లక్ష్మీపతి ఫ్యామిలీలో ఇన్ని విషాదాలు ఉన్నాయా..?

కమెడియన్ లక్ష్మీపతి ఫ్యామిలీలో ఇన్ని విషాదాలు ఉన్నాయా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే కమెడియన్ లక్ష్మీపతి. కితకితలు, అల్లరి, ఆంధ్రుడు, పెదబాబు వంటి సినిమాల్లో తనదైన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. మరి ముఖ్యంగా సునీల్ లక్ష్మీపతి కాంబినేషన్ అంటే మరో లెవల్ అని చెప్పవచ్చు. కడుపుబ్బ నవ్వుకోవచ్చు. అలాంటి లక్ష్మీపతి 2008లో అకాల మరణం చెందారు. ఈయన కంటే నెలరోజుల ముందు తన తమ్ముడు శోభన్ మరణించారు. ఆ తర్వాత లక్ష్మీపతి కూడా మరణించారు.

Advertisement

ఇలా నెల వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో లక్ష్మీపతి కుటుంబం చాలా ఇబ్బందులు పడినట్టు లక్ష్మీపతి కూతురు శ్వేతా లక్ష్మీపతి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. లక్ష్మీపతికి సొంత ఊర్లో రెండు థియేటర్లు ఉండేవి. ఆయన ఒక ఛానల్లో స్క్రిప్టు రైటర్ గా, యాంకర్ గా పనిచేసేవారు. ఆ సమయంలోనే చూడాలని ఉంది సినిమాలో చిన్న పాత్ర రావడంతో చేశాడు. ఈ పాత్ర లక్ష్మీపతికి మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోనే సెట్ అయిపోయాడు లక్ష్మీపతి. బాబాయ్ చనిపోయినప్పుడు తన తండ్రి జీర్ణించుకోలేక పోయారని, అంత్యక్రియల సమయంలో బాధను మర్చిపోవడానికి తాగి వచ్చారని అన్నారు. ఆ విధంగా అదే బాధతో సరిగ్గా నెల తర్వాత డాడీ కూడా చనిపోయారని లక్ష్మీపతి కూతురు తెలియజేసింది.

Advertisement

లక్ష్మీపతి కంటే ముందే తమ్ముడు శోభన్ ఇండస్ట్రీలో ఉన్నారు. కృష్ణ నటించిన రైతు భారతం మూవీకీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయన , ఆ తర్వాత మహేష్ బాబుతో బాబీ సినిమా చేసే అవకాశం వచ్చింది. కానీ బాబీ సినిమా ప్లాప్ అవడంతో మా కుటుంబం ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చిందని ఆమె తెలియజేసింది. అలా నెల రోజుల వ్యవధిలో తండ్రి బాబాయి చనిపోవడం నన్ను చాలా కలవరపరిచిందని, కానీ అయినా నేను కన్నీరు పెట్టుకోలేదని దీనికి ప్రధాన కారణం నేను కన్నీరు పెట్టుకుంటే నాకంటే చిన్నవాళ్ళు కూడా ఏడుస్తారని, రాత్రిళ్ళు ఒంటరిగా ఉండి ఏడ్చేదాన్ని అని తెలియజేసింది. అప్పటినుంచి వాళ్ళ బాధ్యత నేనే తీసుకున్నానని అన్నది. ఇక శోభన్ కొడుకులు ఇద్దరు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, ఒకరు సంతోష్ శోభన్ మరొకరు సంగీత్ శోభన్. పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి సినిమాలతో డీసెంట్ హిట్ అందుకున్నారని లక్ష్మీపతి కూతురు తెలియజేసింది.

also read:పాలలో సోంపు పొడి కలుపుకొని ఆ టైంలో తాగితే..ఎన్ని లాభాలంటే..?

Visitors Are Also Reading