Telugu News » Blog » దానిమ్మని రాత్రి సమయంలో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

దానిమ్మని రాత్రి సమయంలో తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

దానిమ్మ పండు అనేది ఏడాది పొడువునా లభిస్తూనే ఉంటుంది. దానిమ్మలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ దానిమ్మను గింజలు మరియు జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. ఇందులో శరీరానికి అవసరమయ్యే ఫైబర్ ఉంటుంది. దానిమ్మలో క్యాల్షియం,ఐరన్,మెగ్నీషియం,జింక్,విటమిన్ బి,విటమిన్ కే, విటమిన్ సి,విటమిన్ ఈ, ప్రోటీన్,ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్లు వంటివి ఎక్కువగా ఉంటాయి.

Advertisement

also read;మోహన్ బాబు, మురళీమోహన్ చొక్కాలు పట్టుకొని మరీ కొట్టుకున్నారు.. కారణం మంచు విష్ణుయేనా..?

కానీ దానిమ్మను రాత్రి సమయంలో తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.. అవేంటో తెలుసుకుందాం.. దానిమ్మ గింజలను రాత్రి సమయంలో ఎక్కువగా తీసుకుంటే సంతానలేమి సమస్య నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ దానిమ్మ రసంలో ఒక టీస్పూన్ అల్లం రసం కలిపి తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా మోకాళ్ళ కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

Advertisement

అలాగే దానిమ్మ గింజలను తీసుకుంటే అధిక ఒత్తిడి వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా దానిమ్మ పండు నిద్రలేమి వంటి సమస్యలు దూరం చేయడంలో సహకరిస్తుందట. దానిమ్మలో ఉండే ఆంటీ యాక్సిడెంట్లు, పాలి ఫినాల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల ధమనుల్లో, రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి అడ్డంకులు లేకుండా రక్త ప్రసరణ జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి రాత్రి పడుకునే ముందు దానిమ్మ గింజలను లేదంటే దానిమ్మ జ్యూస్ ను తాగడం మంచిదని తెలియజేస్తున్నారు.

Advertisement

also read;Google pay loan: గూగుల్ పే వాడుతున్నారా..8 లక్షలు మీ సొంతం..ఎలాగంటే..?