దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రాల్లో మగధీర చిత్రం ఒకటి. ఈ సినిమా జులై 30, 2009లో విడుదలై బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డులను తిరగరాసింది మగధీర చిత్రం. ఈ చిత్రం గురించి ఆడియో ఫంక్షన్ లో రియల్ స్టార్ శ్రీహరి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
Also Read : అవకాశాలు లేక ఇండస్ట్రీ వదిలి వెళ్లాలనుకున్నాడు., భార్య సలహాతో నిలబడి ఇండస్ట్రీని షేక్ చేశాడు!
Advertisement
“ముఖ్యంగా రాజమౌళి మగధీర కథ చెప్పినప్పుడే నేను సినిమా చూశానని.. తెలుగు ఇండస్ట్రీకి గర్వం మగధీర. అల్లు అరవింద్ గారికి 100 సినిమాలు తీసిన కీర్తి ఈ సినిమా తీసుకొస్తుంది. ఈ సినిమా తరువాత ఒక ఏడాది రెస్ట్ తీసుకో చరణ్.. మార్షల్ వంటి ఆర్ట్ పై 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ కి వెళ్లిపో.. దీని తరువాత తొందర పడి సినిమా చేయవద్దు అని చెప్పాను. ఈ సినిమా తరువాత నేను రిటైర్ అయిపోతాను. ఇక సినిమాలు చేయను అని నిర్మాత దిల్ రాజు గారికి చెప్పాను. మగధీర సినిమాలో రాజమౌళి గొప్ప క్యారెక్టర్ ని డిజైన్ చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.
Advertisement
Also Read : ఆ సినిమా కోసం బాలకృష్ణకు 3 కండీషన్స్ పెట్టిన NTR !
అలాగే నేను అమెరికా వెళ్లినప్పుడు నయగారా పాల్స్ ని ఫస్ట్ చూసి దాని గురించి ఏదో అనుకున్నాను. కానీ ఆ తరువాత చూసి జన్మ ధన్యమైపోయింది. అలాంటి ఫీలింగ్ మగధీర సినిమా చూస్తే కలుగుతుంది. మగధీర సినిమాలో భైరవ.. కమ్ముకుంటున్న ఈ కారు మబ్బులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయి రా.. నువ్వు ఉదయించే సూర్యుడివి అని వాటికి తెలియదు. ఈ రోజు హస్తమించవచ్చు గాక ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్లీ పడుతావురా బైరవ” అనే డైలాగ్ స్టేజీ పై విడుదలకు ముందే చెప్పి అందరికీ ఉత్సాహాన్ని తీసుకొచ్చాడు శ్రీహరి. మగధీర ఆడియో ఫంక్షన్ లో చెప్పిన మాటలు నిజమయ్యాయి. ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ప్రస్తుతం శ్రీహరి మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే.
Also Read : మధ్యలోనే ఆగిపోయిన ఉదయకిరణ్ సినిమాలు ఇవే ..! ఇవే విడుదల అయ్యుంటే అయన ఇమేజ్ ఇంకోలా