Home » APRIL 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 5th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

రాజ్యసభలో బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై చర్చించాలని టీఆర్ఎస్ ఎంపీలు నోటీస్ అంద‌జేశారు. తెలంగాణలో లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌ మార్కెట్ యార్డుల్లోనే ఉందని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, రూల్ 267 ప్రకారం ఇతర బిజినెస్ ఆపేసి , బాయిల్డ్ రైస్ పై చర్చించాలని ఎంపీలు నోటీస్ అందించారు.

ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీ గూటికి చేరుకున్నారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు.

Advertisement


దేశవ్యాప్తంగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచారు. హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ ధర రూ.104.6, లీటర్ పెట్రోల్ ధర రూ.118.57 గా ఉంది.

బంగాళాఖాతంలో ఇంజన్ ఆగి బోటు నిలిచిపోయింది. దాంతో కాకినాడ‌ పర్లోవపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. భీమునిపట్నం వైపు బోటు కొట్టుకుపోతున్నట్లు సెల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సందేశం పంపించారు. ఆ తరువాత సెల్ ఫోన్ స్విచ్చాఫ్ అవ్వ‌డంతో కుటుంబసభ్యలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement


ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ త‌ల్లి శ్రీమతి మీనాక్షి సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్ర‌క‌టించారు. సీఎస్ సోమేష్ కుమార్ ను కేసీఆర్ ఫోన్ లో ప‌రామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కాంగ్రెస్ నేత జ‌గ్గారెడ్డి త‌న రాజీనామా లేఖను విత్ డ్రా చేసుకున్నారు. ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు జ‌గ్గారెడ్డి లేఖ రాశారు. అయితే రాహుల్ గాంధీని చూసిన తర్వాత గతంలో ఏం మాట్లాడినా..? అనేది మర్చిపోయా అంటూ త‌న రాజీనామాను వెన‌క్కి తీసుకున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటిస్తామ‌ని రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్‌తో ఎలాంటి పొత్తులు ఉండవని….. విభేదాలు పక్కనపెట్టి పనిచేయాలని టి. కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.

ఏపీ సీఎం జ‌గ‌న్ నేడు ఢిల్లీ ప‌ర్య‌ట‌న కు వెళుతున్నారు. ఏపీలో మూడు రాజ‌ధానుల ఆవ‌శ్య‌క‌త‌..పోల‌వ‌రం త‌దిత‌ర అంశాల‌పై అమిత్ షా, కేంద్రమంత్రుల‌తో చ‌ర్చించ‌నున్నారు.

చైనా రాజ‌ధాని షాంఘైలో క‌రోనా కోర‌లు తెరుచుకుంది. చైనాలో ఒక్క‌రోజే 13 కేసులు న‌మోదు కాగా షాంఘైలోనే 70శాతం కేసులు న‌మోద‌య్యాయి.

Visitors Are Also Reading