Home » APRIL 28th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 28th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ఐపీఎల్ 2022 లో హైదరాబాద్‌పై గుజరాత్‌ అద్భుత విజయం సాధించింది. చివరి ఓవర్‌లో గుజ‌రాత్ 22 పరుగులు చేసింది. దాంతో హైదరాబాద్‌పై గుజ‌రాత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది.


టీఆర్ఎస్ కు గ‌ట్టి షాక్ త‌గిలింది. టీఆర్ఎస్ ప్లీనరీ మీటింగ్ కోసం భారీగా ఫ్లెక్సీలకు ఏర్పాటు చేశారు. కాగాట్విట్టర్‌లో వ‌చ్చిన ఫిర్యాదుల‌తో అధికారులు ఫైన్ లు విధించారు. మంత్రి తలసానికి రూ.50వేలు, టీఆర్ఎస్‌ జనరల్‌ సెక్రెటరీకి రూ.65వేలు, మైనంపల్లి రోహిత్‌కు రూ.40వేలు, ఆలేరు వెంకటేష్‌కు రూ.10వేలు, దానం నాగేందర్‌కు రూ.5వేలు ఫైన్ విధించారు.

Advertisement

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో పుదచ్చేరి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 1 నుండి 9 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌ను ప్ర‌మోట్ చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

ఎమ్మెల్సీ ప‌ట్నం నాగేంద‌ర్ రెడ్డి పై కేసు న‌మోద‌య్యింది. తాండూర్ సీఐ ని ఫోన్ లో బెదిరించిన‌ట్టుగా ఓ ఆడియో వైర‌ల్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై ప‌లు సెక్ష‌న్ ల కింద కేసులు బుక్ చేశారు.

ఈరోజు రేపు ఎండ‌లు మండిపోయే అవ‌కాశం ఉంద‌ని వాతావారణ‌శాఖ హెచ్చ‌రించింది. కాబ‌ట్టి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.

Advertisement

కేంద్రం ప్ర‌కటించిన ఆద‌ర్శ‌గ్రామాల లిస్ట్ లో టాప్ ప‌ది గ్రామాలు తెలంగాణా ప‌ల్లెలే ఉన్నాయి. అంతే కాకుండా కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్ది ద‌త్త‌త గ్రామం కోలనుపాక ఫ‌స్ట్ ప్లేస్ లో నిలిచింది.

ర‌ష్యా అధ్య‌క్షుడు వాల్దిమ‌ర్ పుతిన్ అనారోగ్యం భారిన‌ప‌డ్డారంటూ అంత‌ర్జాతీయ మీడియాలో క‌థనాలు వినిపిస్తున్నాయి. దానికి కార‌ణం ఇటీవ‌ల పుతిన్ పాల్గొన్న కొన్ని కార్య‌క్ర‌మాల్లో చాలా అల‌స‌ట‌గా క‌నిపించ‌డ‌మే.

అమెరికా ఉపాద్య‌క్షురాలు క‌మ‌లాహారిస్ క‌రోనా బారినప‌డ్డారు. క‌మ‌లా హారిస్ బూస్ట‌ర్ డోస్ వేసుకున్న‌ప్ప‌టికీ ఆమెకు క‌రోనా పాజిటివ్ రావ‌డం ఆందోళ‌న‌క‌రం.

ఆంధ్రా నుండి ఒడిస్సాకు భారీగా కోడిగుడ్ల‌ను ఎగుమ‌తి చేస్తున్నారు. దాంతో ధ‌ర‌లు త‌గ్గిపోతున్నాయంటూ ఒడిస్సా వ్యాపారులు ఆందోళ‌న‌కు దిగారు.

ఏపీ ప్ర‌భుత్వం ఆచార్య సినిమా టికెట్ ధ‌ర‌ను ఫైన‌ల్ చేసింది. మ‌ల్టీప్లెక్స్ ల‌లో రూ.300 లుగా మినిమ‌మ్ టికెట్ ధ‌ర రూ.70 గా ఉండాల‌ని ప్ర‌క‌టించింది.

Visitors Are Also Reading