Home » APRIL 21st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 21st 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

ఐపీఎల్ 2022లో నేడు ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈ నెలలో కూడా గత ఏప్రిల్ తో పోలిస్తే స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరిగింది. గత ఏప్రిల్ లో 720 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది ఈ నెలలో ఇప్పటికే 770 కోట్ల ఆదాయం వ‌చ్చింది. ఈ నెలలో 1000 కోట్లు దాటే అవకాశం ఉందని అధికారులు అంచ‌నావేస్తున్నారు.

111 జీవో ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. కాగాఈ నిర్ణ‌యం పట్ల సీఎం కేసీఆర్ కు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీంతో 84 గ్రామాల ప్రజలకు శాశ్వత విముక్తి లభించిందని అన్నారు. సీఎస్ నేతృత్వంలో కమిటీ వేయటం శుభ పరిణామం అని స‌బితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మారుతి తండ్రి కుచ‌లరావు ఆనారోగ్యంతో మృతిచెందారు. కుచ‌ల‌రావు కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.

రాజ‌ధాని ఢిల్లీలో ఆక్ర‌మ‌ణ‌ల కూల్చివేత‌పై ఆప్ సర్కార్ సీరియస్ అయింది. బుల్డోజ‌ర్ ల‌తో హింస‌ను ఆప‌వ‌చ్చ‌ని బీజేపీ భావిస్తోందని ఢిల్లీ ప‌రిస్థితికి బీజేపీనే కార‌ణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటిని కూలిస్తే ఘ‌ర్ష‌ణ‌ల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దొరుకుతుంద‌ని పేర్కొంది.

ఢిల్లీలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాంతో మాస్క్ ధ‌రించ‌కుంటే రూ.500 జ‌రిమానా విధిస్తామ‌ని సర్కార్ కీల‌క ఆదేశాలు జారీ చేసింది.

నిన్న జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్ లో పంజాబ్ పై ఢిల్లీ అల‌వోక‌గా విజ‌యం సాధించింది. 116 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఒకే వికెట్ న‌ష్టంతో సులువుగా చేదించి విజ‌యం సాధించింది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈనెల 23న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన కౌలు రైతుల కుటుంబాల‌కు ఆర్థిక‌సాయం అందించ‌నున్నారు.

ఏపీ ఐటీ మంత్రిగా గుడివాడ అమ‌ర్నాత్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్ లో పూజ‌ల అనంత‌రం బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు.

Ap cm jagan

Ap cm jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ ఈనెల 22న ఒంగోలులో పర్య‌టించ‌నున్నారు. వైఎస్ఆర్ సున్నా వ‌డ్డీ మూడోవిడ‌త కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు.

Visitors Are Also Reading