Home » APRIL 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 16th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

modi

ప్రధాని మోడీ నేడు గుజరాత్ లో పర్యటించనున్నారు. మోర్బి లోని బాబా ఆశ్రమంలో ఏర్పాటు చేసిన 108 అడుగుల హనుమానున్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవ‌కాశం ఉందని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది.

ఐపీఎల్ లో నేడు ఢిల్లీ బెంగళూరు త‌ల‌ప‌డ‌నున్నాయి. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నేడు వైసీపీ జాబ్ మేళా నిర్వ‌హిస్తోంది. ఉద్యోగాల కోసం 41 వేల మంది పాల్గొన్నారు. 147 కంపెనీలు వ‌చ్చాయి.

తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ఈ రోజుతో ముగియ‌నున్నాయి. ఇక తిరుమ‌ల‌లో భక్తుల ర‌ద్దీ భారీగా పెరిగిపోయిన సంగ‌తి తెలిసిందే.

మే మొదటి వారంలో తెలంగాణలో రాహుల్ గాంధీ ప‌ర్య‌టించ‌నున్నారు. ఒక రోజు వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వ‌హించ‌నున్నారు. రెండో రోజు హైదరాబాద్ లో పర్య‌టించ‌నున్నారు. శనివారం ఉదయం సీనియర్ నేతలు, సాయంత్రం డీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.

Advertisement

సీఎం కేసీఆర్ పది రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. లికింపూర్ భాధిత కుటుంబాలను కేసీఆర్ పరామర్శించనున్నారు. బీజేపీని ఓడించేందుకు కెసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు నేతలు, రైతు సంఘాల నేతలతో చర్చించనున్నారు.

తెలంగాణలో ట్రాఫిక్ చ‌లాన్ లపై డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆ గడువు ముగిసి పోయింది. మొత్తం మూడు వందల రెండు కోట్ల ట్రాఫిక్ చ‌లాన్ లు వ‌సూల‌య్యాయి.

బంగ్లాదేశ్ కు చెందిన ఓ బాలుడు చాక్లెట్ల కోసం ష‌ర్దా నదిని ఈది భారత్ లోకి ప్రవేశించాడు. తిరిగి అదే నదిని ఈది బంగ్లాదేశ్ కు వెళ్తుండగా బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు.

చైనాలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. దాంతో షాంగై న‌గ‌రంతో స‌హా పలు న‌గ‌రాల్లో లాక్ డౌన్ ను విధించారు.

Visitors Are Also Reading