Home » APRIL 14th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

APRIL 14th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఇంటిపై దుండగులు దాడి చేశారు. అర్థరాత్రి వీహెచ్ ఇంటిపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు రాళ్లు విసిరారు. ఇంటి ముందున్న కారును ధ్వంసం చేశారు.

సర్వదర్శన భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నిన్న శ్రీవారిని 88,748 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని 46,400 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది ద‌ర్శించుకున్నారు.

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం జ‌రిగింది. ఆ ప్ర‌మాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. సహాయకచర్యల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Mk Stalin

ఏపీలోని శేషాచలంలో 2015లో జరిగిన ఎన్ కౌంటర్ పై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ స్పందించారు. న్యాయం కోసం అ కుటుంబాలు చేస్తున్న చట్టపరమైన పోరాటానికి ప్రభుత్వం అండగా ఉంటుంద‌న్నారు. 2015, ఏప్రిల్ 7న జరిగిన ఎన్ కౌంటర్లో 20మంది మృతి చెందారు. అది ఒక బ్లాక్ డే అంటూ స్టాలిన్ వ్యాఖ్యానించారు.

తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు జ‌రిగాయి. ఎనిమిది మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. తన మంత్రివర్గ సహచరులు, అధికారులు, ఉద్యోగులు అధికారిక‌ పర్యటనల‌ సమయంలో హోట‌ల్స్ కు బదులుగా ప్రభుత్వ అతిథి గృహం లోనే ఉండాలని చెప్పారు. బంధువులను వ్యక్తిగత పీఏలుగా నిర్మించుకోవ‌ద్ద‌ని సూచించారు.

అహ్మదాబాద్ -ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి అప్డేట్ వ‌చ్చింది. 2026 లో తొలిదశ ట్రయ‌ల్స్ ను నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మొదట గుజరాత్త్ లోని దిల్ మేరా నుండి సూరత్ మ‌ధ్య ట్ర‌య‌ల్స్ నిర్వహిస్తున్నట్టు స్పష్టంచేశారు. 350కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీస్తుంది.

అస్సాం లో దారుణం చోటుచేసుకుంది. విషపూరిత పుట్టగొడుగులు తిని 13 మంది మరణించారు.

మేడిన్ ఇండియా టీకాలే ఎక్కువ రక్షణ ఇచ్చాయని సీర‌మ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అధ‌ర్ పునావావా అన్నారు. ఫైజర్ కంటే మేడిన్ ఇండియా టీకా నుండే రక్షణ అధికంగా ఉందని వెల్లడించారు.

వనపర్తి జిల్లా కు చెందిన మస్తీ పూర్ గ్రామ సర్పంచ్ సుజాత విశ్రాంత ఉద్యోగి మనీ వర్ధన్ రెడ్డి దంపతుల కుమారుడు నరేష్ రెడ్డి ఆర్మీ లో మేజర్ గా పదోన్నతి పొందారు. దాంతో ఆ గ్రామంలో సంబరాలు జరుపుకుంటున్నారు.

Visitors Are Also Reading