ఏపీలో మరికొద్దిసేపట్లో కొత్త మంత్రివర్గం కొలువుదీరనుంది. గతంలో లానే ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు టాక్.
ఐపీఎల్: నేడు హైదరాబాద్‌తో గుజరాత్ తలపడనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
Advertisement
నేడు ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ వర్చువల్ భేటీ కానున్నారు. కోవిడ్, ఇండో-పసిఫిక్, క్వాడ్, ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్ఛించనున్నారు.
ఢిల్లీలో నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపడుతోంది. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా దీక్ష చేస్తున్నారు. దీక్షలో సీఎం కేసీఆర్ తో పాటూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
Advertisement
నేడు భద్రాచలంలో శ్రీరామ పట్టాభిషేకం జరగనుంది. పట్టాభిషేకంలో స్వామివారికి గవర్నర్ తమిళిసై పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు నేడు ఇంటర్నల్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మధ్యప్రదేశ్ లో నర్మదా పురం జిల్లా లో 157 ఏళ్ల క్రితం బ్రిటిషర్లు నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. 130 మీటర్ల తో ట్రాన్స్ఫార్మర్ లోడుతో వెళ్తున్న ట్రక్ బ్రిడ్జ్ పైకి రావడంతో ఒక్కసారిగా కూలిపోయింది.
వరి ధాన్యాన్ని కేంద్రమే కొనాలని టిఆర్ఎస్ ఢిల్లీ లో తెలంగాణ భవన్ ముందు నిరసన దీక్ష చేపడుతోంది. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు.
ట్విట్టర్ లో అత్యధిక వాటా కలిగిన ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ యాజమాన్య బోర్డులోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ కు ప్రస్తుతం 9.2శాతం వాటా ఉంది.