మా అసోసియేషన్ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఇవాళ మా అసోషియేషన్ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలను ఆమోదించారు. రాజీనామాలు వద్దని.. చెప్పినా.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు అంగీకరించలేదని.. అందుకే రాజీనాలు ఆమోదించినట్లు ఈ సందర్భంగా మంచు విష్ణు పేర్కొన్నారు. మా ఎన్నికల ఫలితాల తరువాత రోజున ప్రకాశ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
Advertisement
Advertisement
ముఖ్యంగా అసోషియేషన్ లో మంచు విష్ణు చేసే అభివృద్ధి పనులను అడ్డు రాకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు ప్రకటించారు. అయితే.. దానిపై గతంలో మంచు విష్ణు వ్యతిరేకించినా… ఇవాళ ఆ రాజీనామాలపై ఆమోద ముద్ర వేశారు. కాగా.. అక్టోబర్ 10 వ తేదీన జరిగిన మా అసోసి యేషన్ ఎన్నికల్లో.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ పై మంచు విష్ణు ప్యానెల్ గెలిచిన సంగతి తెలిసిందే.