Home » తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… గ్రూప్స్ ఉచిత కోచింగ్ కు దరఖాస్తులు ఆహ్వానం

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త… గ్రూప్స్ ఉచిత కోచింగ్ కు దరఖాస్తులు ఆహ్వానం

by Bunty
Ad

తెలంగాణ నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్ లను విడుదల చేస్తోంది కేసీఆర్ సర్కారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ ద్వారా డిసెంబర్ కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్లకు పరీక్ష తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే తాజాగా నిరుద్యోగులకు కేసీఆర్ ప్రభుత్వం మరో అదిరిపోయే శుభవార్త చెప్పింది. గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు గ్రూప్ 2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఎస్సీ నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ ద్వారా నిర్వహించే ఉచిత శిక్షణ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అయోమ్ కుమార్ ప్రకటనలో తెలిపాడు.

Advertisement

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల డిగ్రీ మార్కులు ఆధారంగా మెరిట్ మార్కులు ఉన్న మొదటి 100మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా హైదరాబాద్ జిల్లాకు చెందినవారై ఉండాలన్నారు. ఈ శిక్షణ పూర్తిగా నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు జనవరి 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ లేదా 040-23546552 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

read also : “మసూద”లో బుర్కా చాటున ప్రేక్షకులని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading