apj Abdul Kalam Quotes and quotations in Telugu: శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలందించారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఆయన జీవితం ప్రతీ ఒక్కరికీ ఆదర్శనీయం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన మహోన్నతమైన వ్యక్తి అబ్దుల్ కలాం.
అబ్దుల్ కలాం బయోగ్రఫీ in Telugu
ప్రధానంగా మిస్సైల్ మ్యాన్ గా భారత సాంకేతికత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో జైనులాబ్దిన్, ఆసియామ్మ దంపతులకు అబ్దుల్ కలాం జన్మించారు.
Advertisement
అబ్దుల్ కలాం సూక్తులు
రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవీలో కూడా ఆయన నిరాడంబరమైన జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శనీయంగా నిలిచారు. రాష్ట్రపతి పదవీ పూర్తయిన తరువాత ఐఐఎం షిల్లాంగ్ లో అధ్యాపకుడిగా చేరారు. 2015 జులై 27న షిల్లాంగ్ ఐఐఎంలో లెక్చర్ ఇస్తూ కుప్పకూలిపోయారు. అబ్దుల్ కలాం చెప్పిన అద్భుతమైన సూక్తులను ఇప్పుడు మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం.
Advertisement
apj Abdul Kalam Quotes in Telugu & Abdul Kalam quotes in Telugu
- మీరు మీ భవిష్యత్ ని మార్చలేరు.. కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్ ను మార్చుతాయి.
- మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం వరించదు. కానీ మీరు ప్రయత్నిస్తే మాత్రం ఓటమి రాదు.
- ఎవరినైనా చాలా తేలికగా ఓడించవచ్చు.. కానీ వారి మనసును గెలవాలంటే మాత్రం చాలా శ్రమించాలి.
- మన జననం సాధారణమైనదే కావచ్చు. కానీ మన మరణం మాత్రం ఒక చరిత్రను సృనష్టించే విధంగా ఉండాలి.
- నీ మొదటి విజయం తరువాత అలక్ష్యం ప్రదర్శించకూడదు. ఎందుకంటే.. నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే.. నీ మొదటి గెలుపు అదృష్టం కొద్ది వచ్చిందని చెప్పడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు.
- సక్సెస్ అంటే మీ సంతకం ఆటో గ్రాఫ్ గా మారడమే..!
- ఇతరులను ఓడించడం సులువే.. కానీ ఇతరులను గెలవడం కష్టమే.
- కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు.. నీ శక్తి, సామర్థ్యాలను వెలికి తీసి.. నిన్ను నీవు నిరూపించుకోవడానికే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని..
- నువ్వు సూర్యుడి మాదిరిగా ప్రకాశించాలనుకుంటే.. ముందు సూర్యుడిలా మండడానికి సిద్దపడాలి.
- జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలం.
- ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం.. కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంథాలయంతో సమానం. ఇలాంటి ఎన్నో సూక్తులను అబ్దుల్ కలాం చెప్పాడు.
Also Read: Happy new year Wishes, Images, Greetings, Quotes in Telugu 2023