Home » ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల..ఇలా డౌన్‌ లోడ్‌ చేసుకోండి

ఏపీ నిరుద్యోగులకు అలర్ట్‌.. కానిస్టేబుల్ హాల్ టికెట్లు విడుదల..ఇలా డౌన్‌ లోడ్‌ చేసుకోండి

by Bunty
Ad

ఏపీలోని నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. సివిల్ ఎస్సై, ఏపీఎస్సీ ఆర్ ఎస్సై ఉద్యోగాలకు 2023 ఫిబ్రవరి 19న, సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 2023 జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించనున్నారు.

Advertisement

అయితే, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఎస్సై ఉద్యోగాలకు మాత్రం 2023 జనవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక, కానిస్టేబుల్ అభ్యర్థులు జనవరి 12 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. హాల్‌ టికెట్లు కూడా https://slprb.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా చేసుకోవచ్చును.

Advertisement

సివిల్, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక విధానం :

మొదటి దశ ప్రాథమిక రాత పరీక్ష : ఒకటే పేపర్ 200 మార్కులకు (మూడు గంటల పాటు) పరీక్షలో వచ్చే అంశాలు: ఇంగ్లీష్, ఆర్థమెటిక్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, భారత చరిత్ర, సాంస్కృతి, భారత జాతీయోద్యమం, జాగ్రఫీ, పాలిటి, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన వర్తమాన అంశాలు.

రెండో దశ : ఈవెంట్స్ ఉంటాయి

ఏపీఎస్పీ కానిస్టేబుల్ పోస్టులకు తుది ఎంపిక: 100 మార్కుల నిర్వహించే దేహదారుడ్య పరీక్ష, మరో 100 మార్కులకు నిర్వహించే తుది రాత పరీక్షల్లో కలిపి మొత్తం 200 మార్కులకు ఎవరైతే అత్యధిక మార్కులు సాధిస్తారో వాళ్లే ఉద్యోగానికి సెలెక్ట్ అవుతారు.

READ ALSO : Veera Simha Reddy Review in Telugu: “వీర సింహారెడ్డి” రివ్యూ..రికార్డులు బద్దలు కొడుతున్న బాలయ్య

Visitors Are Also Reading