Home » AP Police Constable Preliminary Exam: రేపే కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష.. ఈ రూల్స్‌ పాటించాల్సిందే

AP Police Constable Preliminary Exam: రేపే కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష.. ఈ రూల్స్‌ పాటించాల్సిందే

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్‌. ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ముఖ్యంగా పోలీస్ కావాలని కలలు కని, కఠోరంగా శ్రమించే వారికి శుభవార్త, రేపే పరీక్ష జరగనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జనవరి 22వ తేదీ ఆదివారం అంటే రేపే పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షల నిర్వహణ కేంద్రాలను సందర్శించారు. భద్రత ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు.

Advertisement

పరీక్ష టైమింగ్స్:

Advertisement

ఈనెల 22వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. అయితే అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్ష సెంటర్లోకి అనుమతి ఇస్తారు. అధికారులు ఉదయం 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు.

పాటించాల్సిన రూల్స్:

ఎగ్జామ్స్ సెంటర్ లోకి మొబైల్ ఫోన్, ట్యాబ్, లాప్టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, పర్స్, నోట్స్, చార్ట్ లు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు సహా ఇతర ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని తెలిపారు. కాగా, మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయితే, 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 3,95,415మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

READ ALSO : సౌతాఫ్రికా వ్యక్తితో SRH కావ్య మారన్ లవ్.. వీడియో వైరల్ !

Visitors Are Also Reading