Home » కొత్త జిల్లాల ఏర్పాటు పై కొత్త వివాదం.. హై కోర్టులో ఫిల్ దాఖ‌లు..!

కొత్త జిల్లాల ఏర్పాటు పై కొత్త వివాదం.. హై కోర్టులో ఫిల్ దాఖ‌లు..!

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొత్త జిల్లాల‌ను ఉగాది నుంచి ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా అడుగులు వేస్తోంది. మ‌రొక వైపు జిల్లా కేంద్రం, జిల్లాల పేర్లు, కొత్త జిల్లాలపై వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఏప్రిల్ 02 ఉగాదికి ఏపీలో కొత్త జిల్లాలు ఏర్ప‌డాల‌నే సంక‌ల్పంతో అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పుడు ప్ర‌భుత్వానికి కొత్త జిల్లాల ఏర్పాటు స‌రికొత్త చిక్కును తీసుకొచ్చింది.

Advertisement

ముఖ్యంగా జిల్లాల విభ‌జ‌న‌పై కోర్టులో ఫిల్ దాఖ‌లు అయింది. రాష్ట్రప‌తి ఉత్త‌ర్వులు స‌వ‌రించ‌కుండా విభ‌జ‌న చేయ‌కూడ‌ద‌ని పిల్‌లో పిటిష‌న‌ర్ పేర్కొన్నాడు. అంతేకాదు జ‌నాభా లెక్కింపు, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న పూర్తి కాకుండానే ఏపీ విభ‌జ‌న చ‌ట్టానికి వ్య‌తిరేకం అని అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటును విద్యా ఉద్యోగాల్లో జిల్లాలు జోన్ల ఆధారంగా నియామ‌కాలు చేస్తున్నార‌న్న పిటిష‌న‌ర్ పేర్కొన్నాడు. జిల్లాల విభ‌జ‌న‌కు త‌ప్ప‌నిస‌రిగా రాష్ట్రప‌తి ఆమోదం కావాల‌ని.. రాష్ట్రప‌తి ఆమోదం లేకుండా జిల్లాను విభ‌జ‌న చేయ‌డం వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తాయ‌ని చెప్పాడు.

Advertisement

హైకోర్టులో దాఖ‌లు చేసిన ఈ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం రేపు సీజే బెంచ్ ముందు విచార‌ణ‌కు వ‌చ్చే అవ‌కాశ‌ముంది. వైసీపీ ప్ర‌భుత్వం కొత్త జిల్లాల‌ను ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల ప్రాతిప‌దిక‌గా ఏర్పాటు చేయ‌డంపై స‌ర్వ‌త్రా అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ఏప్రిల్ 02 ఉగాది ప‌ర్వ‌దినం నుంచి కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగంగా ముందుకెళ్లుతుంది. ఈ త‌రుణంలో తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటు పై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కోర్టులో పిల్ దాఖ‌లు అయింది.

Also Read :  ఇక నుంచి నా పూర్తి స‌మ‌యాన్ని అందుకోస‌మే వినియోగిస్తాను.. నాగ‌బాబు పోస్ట్‌ వైర‌ల్‌..!

Visitors Are Also Reading