Home » ఏపీ హైకోర్టు ఉద్యోగాలు..నెలకు రూ.1,47,760ల జీతం.. పూర్తి వివరాలు ఇవే

ఏపీ హైకోర్టు ఉద్యోగాలు..నెలకు రూ.1,47,760ల జీతం.. పూర్తి వివరాలు ఇవే

by Bunty
Ad

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్. ఇప్పటికే తెలంగాణ జిల్లాల్లోని కోర్టుల్లో పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ రాగా, ఇప్పుడు ఏపీలో నోటిఫికేషన్‌ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టులో, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన 39 కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆర్ట్స్ /సైన్స్/ కామర్స్ విభాగంలో డిగ్రీ, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఆఫ్లైన్ విధానంలో జనవరి 25, 2023వ లోపు కింది అడ్రస్ కు దరఖాస్తులు పంపించవలసి ఉంటుంది.

Advertisement

జనరల్ అభ్యర్థులు రూ.1000 లు, ఎస్సీ/ఎస్టీ/ వికలాంగ అభ్యర్థులు రూ. 500లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఆన్లైన్ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 4, 2023న నిర్వహిస్తారు. ఫలితాలు అదే నెల 8న విడుదలవుతాయి. ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

READ ALSO : పవన్ సినిమాల్లో నటించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్లు !

Visitors Are Also Reading