Home » ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. స్కిల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జాబ్‌ మేళా

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జగన్ సర్కార్.  ఆంధ్ర  ప్రదేశ్ లో పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పలు జాబ్ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు జాబ్ మేళాలను నిర్వహించిన ఏపీఎస్డిసి తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 27వ తేదీన నిర్వహించనున్న జాబ్ మేళాలో కుశలవ హుండాయ్, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొననున్నాయి. ఆ ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Ap cm jagan

Ap cm jagan

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు,

Advertisement

 

* ఈ జాబ్ మేళాలో భాగంగా కుశలవ హుండాయ్, అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ సంస్థలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.

Advertisement

 

* హుండాయ్ కంపెనీ మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో సేల్స్ మేనేజర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ప్యాకర్, సర్వీస్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ వంటి పోస్ట్ లు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైనవారు విజయవాడలో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల నుంచి 15 వేల వరకు ఉంటుంది.

 

* అపోలో ఫార్మసీస్ లిమిటెడ్ లో మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫార్మసిస్ట్, ఫార్మాసి అసిస్టెంట్, ఫార్మసీ ట్రైని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, బి/ఎం/డి ఫార్మసి అర్హతతో పాటు పిసిఐ సర్టిఫికెట్ కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,110 నుంచి రూ.16 వేల వరకు చెల్లిస్తారు.

Visitors Are Also Reading