Home » విద్యుత్ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్…ఆ డబ్బులు వెనక్కి..!

విద్యుత్ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్…ఆ డబ్బులు వెనక్కి..!

by AJAY
Ad

రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ట్రూ అప్ ఛార్జీల కింద వసూలు చేసిన డబ్బులను వినియోగదారులకు తిరిగి ఇస్తామని ప్రకటించింది. నవంబర్ నెలలో వినియోగానికి సంబంధించి డిసెంబర్ నెల బిల్లులో ఆ మేరకు చార్జీలు తగ్గాయి. దాంతో ఛార్జీల కింద వసూలు చేసిన మొత్తాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. 2014 -15 నుండి 2018 -19 సంవత్సరానికి సంబంధించి ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడిసిఎల్ సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్ ఛార్జీల పిటిషన్ల ఆధారంగా ఏపీఈఆర్సి గత ఆగస్టు 27 తేదీన రూ. 3,060 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలుకు అనుమతిచ్చింది. ఏపీఎస్పిడీసీఎల్ రూ.3,060 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ. 609 కోట్ల మేర ఎనిమిది నెలల్లో వసూలు చేసేందుకు సిద్ధం అయ్యాయి.

Advertisement

 

Ap cm jagan

Ap cm jagan

అయితే సెప్టెంబర్-అక్టోబర్ బిల్లులలో ఛార్జీలను విధించారు. కానీ న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్సీ ఆదేశాలను వెనక్కు తీసుకుంది. అందువల్లనే విద్యుత్ బిల్లులలో చార్జీలు లేకుండా వినియోగదారులకు అందుతున్నాయి. అయితే వినియోగదారుడు ఇప్పటికే చెల్లించినట్లు బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. దాంతో నవంబర్ నెల నుండి వినియోగదారులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే దానికి సంభందించిన ప్రక్రియ కూడా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట లభించనుంది.

Advertisement

Also Read: ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిభిరం…బ్ల‌డ్ డొనేట్ చేసిన స‌జ్జ‌నార్..!

Visitors Are Also Reading