Home » ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. అమ్మ‌కానికి అమ‌రావ‌తి భూములు.. ఎకరం ఎంతో తెలుసా..?

ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. అమ్మ‌కానికి అమ‌రావ‌తి భూములు.. ఎకరం ఎంతో తెలుసా..?

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మ‌రొక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే నిధుల స‌మీక‌ర‌ణ కోసం ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించింది. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అమ‌రావ‌తిలోని భూములు అమ్మేందుకు ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసింది. రాజ‌ధాని అభివృద్ధికి నిధుల స‌మీక‌ర‌ణలో భాగంగా రాజ‌ధాని భూముల‌ను విక్ర‌యించాల‌ని సీఆర్‌డీఏ ప్ర‌ణాళిక‌లు రూపొందించింది. తొలి విడ‌తలో మొత్తం 248.34 ఎక‌రాల భూమిని అమ్మాల‌ని నిర్ణ‌యించింది. ఎక‌రం భూమి ధ‌ర క‌నీసం రూ.10కోట్లుగా నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం. మొత్తం దాదాపు రూ.2,500 కోట్లు స‌మీక‌రించ‌నున్న‌ది. వేలం ద్వారా భూముల విక్ర‌యానికి అనుమ‌తిస్తూ.. జీవో నెంబర్ 389 జారీ చేసింది. వ‌చ్చేనెల‌లో భూముల‌ను వేలం ప్ర‌క్రియ ప్రారంభం కానుంది.

Advertisement

Advertisement

మొత్తం 600 ఎక‌రాల భూమిని విక్ర‌యించేందుకు సీఆర్‌డీఏ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తుంది. అమ‌రావ‌తి నిర్మాణానికి బ్యాంకులు రుణాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో సొంతంగా నిధులు స‌మీకరించుకునే క్ర‌మంలో భూముల విక్ర‌యానికి సిద్ధం అయింది. గ‌తంలో బీఆర్ షెట్టి మెడిసిటి కోసం ఇచ్చిన 100 ఎక‌రాలు, లండ‌న్ కింగ్స్ క‌ళాశాల‌కు ఇచ్చిన 148 ఎక‌రాల‌ను విక్ర‌యించాల‌ని ప్ర‌భుత్వం విక్ర‌యించ‌నున్న‌ది. ఆయా సంస్థ‌ల‌కు భూములు కేటాయించినా ఎలాంటి పురోగ‌తి లేకపోవ‌డంత ఆ భూములు విక్ర‌యించాల‌ని భావిస్తోంది. ప్ర‌భుత్వం అమ్మాల‌నుకున్న 600 ఎక‌రాల‌ను ఏడాదికి 50 ఎక‌రాల చొప్పున విక్ర‌యించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించిన స‌మీక్ష‌లో భూములు విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

 


ఇదిలా ఉండ‌గా.. అమ‌రావ‌తి భూముల విక్ర‌యంపై ప్ర‌తిప‌క్షాలు కానీ, రైతులు కానీ ఇంకా స్పందించ‌లేదు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి రాజ‌ధాని అంశంపై దుమారం జ‌రుగుతూనే ఉంది. ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న చేయ‌డంతో అమ‌రావ‌తి ప్రాంత రైతుల‌తో పాటు రాజ‌కీయ పార్టీఉల కూడా తీవ్రంగా వ్య‌తిరేకించాయి. రాజ‌ధాని రాజ‌కీయం దాదాపు రెండేండ్ల కాలం పాటు కొన‌సాగింది. చివ‌రికి రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. ప్ర‌భుత్వం త‌మ‌కు అన్యాయం చేస్తోంద‌ని త‌మ‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంద‌ని కోర్టుకు వెల్ల‌డించారు. విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం రైతుల‌కు అనుకూలంగా తీర్పు వెల్ల‌డించింది.

Visitors Are Also Reading