Home » చంద్ర‌బాబుకు ఏపీ డిప్యూటీ సీఎం స‌వాల్‌..!

చంద్ర‌బాబుకు ఏపీ డిప్యూటీ సీఎం స‌వాల్‌..!

by Anji
Ad

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దమ్ము, ధైర్యం ఉంటే కొత్త పార్టీ పెట్టి పోటీ చేయాలని సవాల్ విసిరారు. మంత్రి పదవులపై సీఎం వైఎస్ జగన్ నిర్ణయం శిరోధార్యం అన్నారు.

Advertisement


నారాయణస్వామి పదవిలో ఉన్నా లేకున్నా వైయస్ జగన్ తోనే ఉంటామని స్పష్టం చేశారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత వైయస్ జగన్ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ పై పోటీ చేస్తా అన్న చంద్రబాబు కి దమ్ము ధైర్యం ఉంటే కొత్త పార్టీ పెట్టీ పోటీచేయాలని.. అలా గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ సవాల్‌ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

Advertisement

Also Read : సామాన్యుల‌కు మ‌రొక షాక్‌.. భారీగా పెర‌గ‌నున్న బిస్కెట్ ధ‌ర‌లు..!

Visitors Are Also Reading