Home » ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.36 లక్షల జీతం !

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.36 లక్షల జీతం !

by Bunty
Ad

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కు చెందిన సెంటర్ ఫర్ స్ట్రాటేజిక్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్, 17 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, అనలిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Advertisement

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ, సిఏ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ సంబంధిత స్పెషలైజేషన్ లో లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు జనవరి 17, 2023వ తేదీ లోపు కింది ఈమెయిల్ ఐడికి దరఖాస్తులు పంపించవలసి ఉంటుంది.

Advertisement

షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి ఎంపికైన వారి వివరాలు జనవరి 27న ప్రకటిస్తారు. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. తుది మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 17న విడుదల అవుతుంది. ఎంపికైన వారికి ఏడాదికి రూ. 5.4 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి : వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు కేసీఆర్ బంపర్ ఆఫర్

Visitors Are Also Reading