Telugu News » Blog » ఏపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. ప్రిలిమినరీ కీ విడుదల

ఏపీ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. ప్రిలిమినరీ కీ విడుదల

by Bunty
Ads

ఏపీలో ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 91% అభ్యర్థులు హాజరైనట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. అలాగే కీని సైతం రిలీజ్ చేసేసింది రిక్రూట్మెంట్ బోర్డు.  ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా, 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే, ఆదివారం రిలీమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా, 45,268 మంది గైర్హాజరు అయ్యారు. ఇక ముందుగా చెప్పిన టైంకి slprb.ap.gov.in వెబ్సైట్లో ప్రిలిమినరీ ఆన్సర్ కి అప్ లోడ్ చేశారు. అధికారులు జనవరి 25వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ప్రిలిమినరీ ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలను తెలిపేందుకు id[email protected] మెయిల్ ఐడి కేటాయించింది రిక్రూట్మెంట్ బోర్డు. కాగా త్వరలోనే ఫిజికల్ ఈవెంట్స్  జరుగనున్నాయి.

Advertisement

https://slprb.ap.gov.in/PDFS/Preliminary%20Key_PC_22.01.2023.pdf