Home » ఏపీ ముఖ్య‌మంత్రి శుభ‌వార్త‌.. ఇక వారికి రూ.3ల‌క్ష‌ల రుణాలు

ఏపీ ముఖ్య‌మంత్రి శుభ‌వార్త‌.. ఇక వారికి రూ.3ల‌క్ష‌ల రుణాలు

by Anji

ఓటీఎస్ ప‌థ‌కంపై ఇవాళ తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలోఓ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయణ, సీఎస్ డాక్ట‌ర్ సమీర్ శ‌ర్మ‌, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ స్పెష‌ల్ సీఎస్ వై శ్రీ‌ల‌క్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెష‌ల్ సీఎస్ అజ‌య్ జైన్, రెవెన్యూ శాఖ స్పెష‌ల్ సీఎస్ ర‌జ‌త్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సంపూర్ణ గృహ హ‌క్కు ప‌థ‌కం ల‌బ్దిదారుల‌కు బ్యాంకుల నుండి రుణ స‌దుపాయం అందించే కార్య‌క్ర‌మమును సీఎం జ‌గ‌న్ ప్రారంభించారు.

ముఖ్య‌మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.20వేల చెల్లించి ఓటీఎస్ తీసుకోవ‌డం ద్వారా ఎటువంటి లిటిగేష‌న్ లేని క్లియ‌ర్ టైటిల్‌, ల‌బ్దిదారుల‌కు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఆ కాగితాల‌ను బ్యాంకులో పెట్టి రూ.3లక్ష‌ల వ‌ర‌కు రుణం తీసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. దీని వ‌ల్ల ల‌బ్దిదారులు మ‌రింత అభివృద్ధి చెంద‌డానికి అవ‌కాశ‌ముంటుంద‌ని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఉచిత రిజిస్ట్రేన్‌, ఉచిత స్టాంప్ డ్యూటీ వ‌ల్ల రూ.1600 పేద వ‌ర్గాల‌కు లాభం చేకూరింద‌ని తెలిపారు. రుణ‌మాఫీ ద్వారా మ‌రొక రూ.10వేల కోట్ల ల‌బ్ది జ‌రిగింద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు.

Also Read :  Ukraine Russia War : చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైన ఉక్రెయిన్‌, ర‌ష్యా

Visitors Are Also Reading