ఆంధ్రప్రదేశ్‌లో నూతన కేబినెట్ కొలువు దీరింది. 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం సందడిగా సాగింది. అంబటి రాంబాబు నుంచి పెట్టి విడుదల రజినీ వరకు మంత్రులు ప్రమాణం చేశారు. ముగ్గురు మాత్రమే ఇంగ్లీష్‌లో ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్, ఉషశ్రీ చరణ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేసారు.
Advertisement
మిగిలిన వారందరూ తెలుగులోనే చేశారు. ఆ తరువాత సీఎం జగన్‌కు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది సీఎం జగన్ కాళ్లకు నమస్కారం చేసారు. ప్రమాణం తరువాత కొత్త మంత్రులతో గ్రూప్పోటో దిగారు సీఎం జగన్, గవర్నర్ హరిచందన్. ఏపీ మంత్రులకు సీఎం జగన్ శాఖలు కేటాయించారు. ఏపీ కేబినెట్లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉండనున్నారు. రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, అంజాద్ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామిలకు ఉపముఖ్యమంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు.
మంత్రులకు కేటాయించిన శాఖల వారిగా వివరాలు
1. ధర్మాన ప్రసాదరావు- రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు
2. సీదిరి అప్పలరాజు – పశుసంవర్థక, మత్స్యశాక
3. దాడిశెట్టి రాజా – రహదారులు, భవనాల శాఖ
4. గుడివాడ అమర్నాథ్ – పరిశ్రమలు, ఐటీశాఖ
5. వేణుగోపాల్ – బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార పౌరసంబంధాలు
Advertisement
6. తానేటి వనిత – హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ
7. జోగి రమేష్ – గృహనిర్మాణశాఖ
8. కారుమూరి నాగేశ్వరరావు – పౌరసరఫరాల శాఖ
9. మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ
10. విడదల రజని – వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
11. కొట్టు సత్యనారాయణ – దేవాదాయ
12. బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
13. అంబటి రాంబాబు – జలవనరుల శాక
14. ఆదిమూలపు సురేశ్ – పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ
15. కాకాణి గోవర్థన్‌రెడ్డి – వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ
16. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – గనులు, అటవీ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ
17. ఆర్.కే.రోజా – పర్యాటక, యువజన, క్రీడల శాఖ
18. కే.నారాయణ స్వామి – ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ
19. అంజాద్ బషా – ఉపముఖ్యమంత్రి, మైనారిటీ వెల్పేర్
20. బుగ్గన – ఆర్థిక, శాసనసభ వ్యవహారాలు, ప్రణాళిక శాఖ
21. గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
22. ఉష శ్రీ చరణ్ – మహిళా శిశు సంక్షేమ శాఖ
23. బూడి ముత్యాల నాయుడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
24. రాజన్నదొర- ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ
25. వినిపే విశ్వరూప్ – రవాణాశాఖ
వీరిలో బొత్స సత్యనారాయణ, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరు జయరాం, నారాయణస్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్ సీదిరి అప్పలరాజు, తానేటి వనిత రెండవసారి మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు.