Home » ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు.. 12 వేల జీతం.. పూర్తి వివరాలు ఇవే!

ఏపీలో అంగన్వాడీ ఉద్యోగాలు.. 12 వేల జీతం.. పూర్తి వివరాలు ఇవే!

by Bunty

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ విజయనగరం జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో భాగంగా వివిధ అంగన్వాడి కేంద్రాల్లో, 60 అంగన్వాడి వర్కర్, అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళలై ఉండాలి. జూలై 1, 2023వ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 10, 2023వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసులో అందజేయాలి.

దరఖాస్తులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పదో తరగతిలో సాధించిన అర్హత మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ఉంటుంది. ఎంపికైన వారికి ఈ నెలకు రూ. 7,000 నుంచి రూ. 11500 వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

read also : నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని పోగొట్టుకున్నాను.. కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ సునీత!

Visitors Are Also Reading